/rtv/media/media_files/2025/05/19/9DpVVcBgKo9vG9NuFejl.jpg)
MAMATA-YUSUF-PATHAN
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన ఆపరేషన్ సిందూర్ ఔట్రిచ్ కార్యక్రమంపై ఆమె సెటైర్లు వేశారు. టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠాన్‌ను తమకు తెలియకుండా ఎలా ఎంపిక చేశారంటూ ప్రశ్నలు సంధించారు. యూసఫ్ ఈ డెలిగేషన్ నుంచి తప్పుకుంటారంటూ సీఎం మమత ప్రకటించారు. తమ పార్టీని సంప్రదించకుండానే కేంద్రం నిర్ణయం తీసుకుందని మమత చెప్పుకొచ్చారు. తృణమూల్ ఏ ప్రతినిధి పంపాలో కేంద్రం ఎలా నిర్ణయం తీసుకుంటుందని సీఎం ప్రశ్నించారు. కాగా కేంద్ర ప్రభుత్వం 7 అఖిలపక్ష బృందాలను వివిధ దేశాలకు పర్యటనకు పంపనున్నట్లు ప్రకటించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పఠాన్, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరిని ఓడించారు.
అఖిలపక్ష బృందంలో
విదేశాలకు వెళ్లే మోడీ ప్రభుత్వ అఖిలపక్ష బృందంలో బీజేపీకి చెందిన రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, కాంగ్రెస్‌కు చెందిన శశి థరూర్, జెడియుకు చెందిన సంజయ్ కుమార్, డిఎంకెకు చెందిన కనిమొళి, ఎన్‌సిపి-ఎస్‌పికి చెందిన సుప్రియా సులే, శివసేనకు చెందిన శ్రీకాంత్ షిండే ఉన్నారు. వారందరూ వేర్వేరు ప్రతినిధి బృందాలకు నాయకత్వం వహిస్తారు. మొత్తం 51 మంది రాజకీయ నాయకులను విదేశాలకు పంపుతున్నారు. ఈ ప్రతినిధులు 32 దేశాలతో పాటు బ్రస్సెల్స్‌లోని యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు.
ఈ ప్రతినిధి బృందంలో మాజీ కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్ , ఎంజె అక్బర్, ఆనంద్ శర్మ, వి మురళీధరన్, సల్మాన్ ఖుర్షీద్ , ఎస్ఎస్ అహ్లువాలియా కూడా ఉన్నారు .వారందరూ ప్రస్తుతం పార్లమెంటు సభ్యులు కారు. విదేశాంగ విధానం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని, అలాంటి విషయాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆదివారం అన్నారు.
Also Read : TG News: ప్రెస్ క్లబ్‌లో తన్నుకున్న INTUC నేతలు.. పిడిగుద్దుల వీడియో వైరల్!
operation Sindoor | india | telugu-news | cm-mamatha-benarjee | yusuf-pathan