వక్ఫ్‌ బోర్డ్‌ బిల్లుపై ఘర్షణ.. వాటర్ బాటిల్‌ను పగలగొట్టిన టీఎంసీ నేత

ఢిల్లీలోని వక్ఫ్‌ బోర్డ్‌ సవరణ బిల్లుపై జరిగిన సమావేశంలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ్‌ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కల్యాణ్ బెనర్జీ కోపంతో గ్లాస్ వాటర్‌ బాటిల్‌ను పగలగొట్టాడు. దీంతో ఆయన చేతి వేళ్లకి గాయాలయ్యాయి.

New Update

మంగళవారం ఢిల్లీలోని వక్ఫ్‌ బోర్డ్‌ బిల్లుపై జరిగిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో అపశృతి చోటుచేసుకుంది. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ్‌ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కల్యాణ్ బెనర్జీ కోపంతో గ్లాస్ వాటర్ బాటిల్‌ను పగలగొట్టారు. దీంతో ఆయన చేతి వేళ్లకి గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన అనంతరం ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీ, ఆప్ నేత సంజయ్ సింగ్.. కల్యాణ్‌ బెనర్జీని చికిత్స కోసం బయటికి తీసుకెళ్లారు.   

కోపంతో టేబుల్‌పై.. 

వక్స్ఫ్‌ బోర్డుపై జరిగిన ఈ జేపీసీ సమావేశంలో పలువురు ప్రముఖులు, రిటైర్డ్ జడ్జీలు, అలాగే సుప్రీంకోర్టు లాయర్లు పాల్గొన్నారు. ఈ అంశంపై చర్చలు నడుస్తుండగా.. కల్యాణ్ బెనర్జీ మూడు సార్లు మాట్లాడారు. అయితే మరోసారి మాట్లాడాలనుకున్నారు. కానీ బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ ఇద్దరి నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. అసభ్యకర పదజాలంతో ఒకరినొకరు తిట్టుకున్నారు. దీంతో కల్యాణ్ బెనర్జీ కోపంతో గ్లాస్ వాటర్‌ బాటిల్‌ను తీసుకొని.. టేబుల్‌పై బలంగా బాదాడు. ఇలా చేయడంతో ఆయన చేతి వేళ్లకి గాయాలయ్యాయి. 

Also Read: లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన వారికి రూ.కోటిగా పైగా రివార్డు..

కల్యాణ్ బెనర్జీ సస్పెండ్

ఈ తర్వాత కల్యాణ్ బెనర్జీ పగిలిపోయిన వాటర్‌బాటిల్‌ను ఛైర్మన్‌ వైపు కూడా విసిరారు. దీంతో గందరగోళం నెలకొన్న ఈ సమావేశం కాసేపు వాయిదా పడింది. అనంతరం కల్యాణ్‌ బెనర్జీ బయటికి వెళ్లి చేతి వేళ్లకి కట్లు కట్టించుకున్నారు. అయితే ఆయన ఇలా ప్రవర్తించినందుకు ఒకరోజుపాటు ఈ పార్లమెంటరీ కమిటీ నుంచి సస్పెండ్ అయ్యారు.  

ముస్లింలను టార్గెట్ చేస్తున్నారు

బీజేపీ ఎంపీ జగదాంబిక పాల్ నేతృత్వంలో వక్స్ప్‌బోర్డ్‌ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ బిల్లుకు సంబంధించి విపక్ష సభ్యులు సంప్రదింపుల విధానంపై ప్రశ్నలు లేవనెత్తారు. అయితే బీజేపీ నేతలు వారికి కౌంటర్ ఇస్తూ మాట్లాడారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని.. ముస్లిం కమ్యూనిటీని టార్గెట్ చేస్తున్నారంటూ కొందరు విపక్ష నేతలు విమర్శలు చేశారు. ఈ బిల్లును అత్యవసరంగా తీసుకురావడంపై కూడా ప్రశ్నలు లేవనేత్తారు.  

మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ వక్ఫ్‌ బోర్డు బిల్లను విమర్శిస్తూ దాదాపు గంట పాటు ప్రెజెంటేషన్ ఇచ్చారు. అందులో ఉన్న లోపాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ బీజేపీ నేతలు మాత్రం ఈ బిల్లును సమర్థించారు. వక్ఫ్‌ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌లో సంస్కరణలు తీసుకురావడం, పారదర్శకంగా ఉండేలా చూడటం అవసరమని వాదించారు. 

Also Read: బ్రిక్స్‌ సదస్సు.. రష్యాకు చేరుకున్న ప్రధాని మోదీ..

వక్ఫ్ బోర్టు సవరణ బిల్లు ఏం చెబుతోంది ?

కేంద్ర ప్రభుత్వం.. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంటులో ఆమోదించి అమల్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇందులో చేసిన సవరణల వల్ల వక్ఫ్ ఆస్తులపై కేంద్ర, రాష్ట్ర బోర్డులకు ఉన్న అధికారాలు కట్టడి చేయబడతాయి. దీనివల్ల వక్ఫ్‌ బోర్డుల నిర్వహణలో మరింత పారదర్శకత వస్తుందని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. సెంట్రల్, స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో తప్పనిసరిగా మహిళలకు ప్రాతినిథ్యం కల్పించాలని కూడా కేంద్రం ఈ సవరణ బిల్లులో చెప్పింది. వక్ఫ్‌ బోర్డులు ఏదైనా భూమిని లేదా ఆస్తిని తమదని ప్రకటించుకోవడం వల్ల వివాదాలు, అధికార దుర్వినియోగానికి కారణమవుతున్నాయని కూడా తెలిపింది. అయితే వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు చట్టమైతే.. ఇక వక్ఫ్‌ బోర్డులు గతంలో లాగా ఏ ఆస్తిని కూడా స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించుకునే అవకాశం ఉండదు. 

#bjp #tmc #waqf-amendment-bill-2024 #waqf-board
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe