J&K: మూడో విడత కూడా అయిపోయింది..జేకేలో అక్టోబర్‌‌ 8న ఫలితాలు

జమ్మూ–కాశ్మీర్‌‌లో అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ కూడా ముగిసింది. భారీగా ఓటింగ్ నమోదయిందని ఎన్నికల సంఘం తెలిపింది. అక్టోబర్ 8న మొత్తం మూడు విడతల పోలింగ్ ఫలితాలను కలిపి విడుదల చేయనున్నారు. 

J&K Assembly Elections
New Update

Third Phase Polling In j&K: 

జమ్మూ–కాశ్మీర్‌‌లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పదేళ్ళ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఉత్పాహంగా పాల్గొన్నారు. అన్ని విడతల్లో ఓటు వేయడానికి జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పుల్వామా లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఎటువంటి గొడవలు జరగకుండా పోలింగ్ సక్రమంగా జరిగింది. ఇక మూడవ విడతలో...ముందు రెండింటి కంటే ఎక్కు ఓటింగ్ నమోదైందని భారత ఎన్నికల సంఘం చెప్పింది. చివరి విడతలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగిందని..65.48% పోలింగ్ నమోదైందని తెలిపింది. మొత్తం 40 నియోజకవర్గాల్లో ఈరోజు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు భారీగా ఓటింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇక అక్టోబర్ 8న మొత్తం 90 నియోజకవర్గాలు, మూడు విడతల పోలింగ్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. 

జమ్మూ–కాశ్మీర్‌‌లో పదేళ్ళ అసెంబ్లీ తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. చివరిసారిగా అక్కడ 2014లో  ఎన్నికలు జరిగాయి. అదీకాక ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇక్కడ ఎవరు గెలుస్తారనేదానిపై ఉత్కంఠత కొనసాగుతోంది. ప్రస్తుతం జమ్మూ–కాశ్మీర్ పూర్తిస్థాయి రాష్ట్రం హోదాను పొందింది. ఇక్కడ మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటికి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో సెప్టెంబర్ 18న మొదటి విడతగా 24 నియోజకవర్గాల్లో పోలింగ్‌ను నిర్వహించారు. మొత్తం 19 మంది అభ్యర్ధులు ఇందులో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.  వీటిల్లో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు అయిన పుల్వామా లాంటివి కూడా ఉన్నాయి. మొదటి దశలో మరాజ్‌ రీజియన్‌లోని అనంత్‌నాగ్, పుల్వామా, కుల్గాం, షోపియాన్‌ , చీనాబ్‌ లోయలోని దోడా, కిష్టావర్, రాంబన్‌పాంపోర్, త్రాల్, పుల్వామా, రాజ్‌పుర, జైనాపుర, షోపియాన్, డీహెచ్‌ పుర, కుల్గాం, దేవ్‌సర్, దూరు, కోకెర్‌నాగ్, అనంత్‌నాగ్‌ వెస్ట్, అనంత్‌నాగ్, శ్రీగుఫ్వారా-బిజ్‌బెహరాలలో  జిల్లాల్లో పోలింగ్ జరిగింది. ఇక్కడ ప్రధానంగా పోటీ బీజేపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) -కాంగ్రెస్ కూటమి, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) మధ్య ఉంది. దీని తర్వాత సెప్టెంబర్ 25న రెండవ విడత పోలింగ్ నిర్వహించారు. మొత్తం 26 నియోజకర్గాల్లో మొత్తం 239 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్మూ కశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా సహా పలువురు కీలక నేతలు పోటీలో ఉన్నారు. 

Also Read: టార్గెట్ ముఖ్యమంత్రులు..సిద్ధరామయ్య చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు

#elections #jammu-kashmir
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe