/rtv/media/media_files/2025/03/24/Fq5IvbqgDDBG3pPR9cci.jpeg)
Parliament
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. విపక్షాలు ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చకు పట్టుబట్టడంతో తొలిరోజే లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు, రాజ్యసభలో ‘ది బిల్స్ ఆఫ్ ల్యాడింగ్’ బిల్లుపై చర్చ జరిగి ఆమోదం పొందగా.. లోక్‌సభ ఇప్పటివరకు 3 సార్లు సభ వాయిదా పడింది.
ఆగస్టు 21 వరకు మొత్తంగా 21 రోజుల పాటు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో మొత్తంగా 15 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.
ఆ బిల్లులు ఇవే..
- -ది బిల్స్ ఆఫ్ ల్యాడింగ్ బిల్లు 2024: తొలిరోజే రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు.
- -సముద్ర రవాణా బిల్లు - 2024
- -తీర ప్రాంత షిప్పింగ్ బిల్లు - 2024
- -గోవా రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల్లో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్యం పునర్వ్యవస్థీకరణ బిల్లు - 2024
- -మర్చంట్ షిప్పింగ్ బిల్లు - 2024
- -ఇండియన్ పోర్ట్స్ బిల్లు - 2025
- -ఆదాయపు పన్ను బిల్లు - 2025
- -మణిపూర్ వస్తు, సేవల పన్ను (సవరణ) బిల్లు - 2025 (ఆర్డినెన్స్ స్థానంలో)
- -జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు - 2025
- -ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (సవరణ) బిల్లు - 2025
- -పన్ను చట్టాలు (సవరణ) బిల్లు - 2025
- -భూ వారసత్వ ప్రదేశాలు, భౌగోళిక అవశేషాలు (సంరక్షణ, నిర్వహణ) బిల్లు - 2025
- -గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు - 2025
- -జాతీయ క్రీడా పాలనా బిల్లు - 2025
- -జాతీయ డోపింగ్ నిరోధక సవరణ బిల్లు - 2025