/rtv/media/media_files/2025/02/18/Rb087wXDD06L8K8e2vLr.jpg)
tesla
ఇండియన్ మార్కెట్‌లోకి అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా రాక డేట్ ఫిక్స్ అయ్యింది. భారత్‌లో తమ కార్ల విక్రయాలు ప్రారంభించడానికి మస్క్ టెస్లా కంపెనీ జులై 15న ముంబయిలో తొలి షోరూం ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో టెస్లా షోరూంను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే 5 వై మోడల్ కార్లు ముంబయికి చేరుకున్నాయట. చైనాలోని షాంఘై నుంచి వాటిని తీసుకొచ్చినట్లు సమాచారం. అనంతరం దిల్లీలోనూ మరో షోరూం ఏర్పాటుచేయడానికి మస్క్ ప్లాన్‌లో ఉన్నాడు.
🚨 BREAKING: According to reports circulating in Indian media, Tesla might launch in India on July 15, and Elon Musk could visit for the announcement.
— DogeDesigner (@cb_doge) July 10, 2025
However, there’s no official confirmation yet from Tesla or Musk. pic.twitter.com/IJ8z5wCxaR
టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు 2021 నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని మస్క్ కంపెనీ డిమాండ్ చేసింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలు కొనుగోలు చేయాలని కేంద్రం షరతు పెట్టింది. ఇందుకు మస్క్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో టెస్లా ఎంట్రీ ఆలస్యమవుతూ వచ్చింది. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు మస్క్ ఆయనతో భేటీ అయ్యారు. దీంతో ఈ బిజినెస్ డీల్ కుదిరింది. ఈ విషయంలో ఎలన్ మస్క్ ట్రంప్‌తో విభేధించాడు.