Train Accident: రెడ్ సిగ్నల్ జంప్ చేయడం వల్లనే..రైలు ప్రమాదం

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌ రైల్వేస్టేషన్‌ దగ్గరలో గూడ్స్ రైలును ప్యాసెంజర్ ట్రైన్ వెనుక నుంచి ఢీ కొంది. ఇందులో 10 మృతి చెందారు. ప్యాసెంజర్ పైలు రెడ్ సిగ్నల్ గమనించకుండా ముందు వెళ్ళడం వల్లనే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

New Update
train

ఛత్తీస్‌గడ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బిలాస్‌పూర్‌లోనిజైరాం నగర్ స్టేషన్‌ వద్ద రెండు రైళ్లు ఢీకొన్నాయి. గూడ్సు రైలును ప్యాసెంజర్‌ రైలు ఢీకొంది. కోర్బా జిల్లాలోని గెవరా నుంచి బిలాస్‌పుర్‌కువెళ్తున్న ప్రయాణికుల ట్రైన్...గటోరా- బిలాస్‌పుర్‌ స్టేషన్‌ మార్గమధ్యంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా...మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు వ్యక్తులు రెండు రైళ్ళకు మధ్యలో చిక్కుకుపోయారు. గూడ్సు రైలు, ప్యాసెంజర్ ట్రైన్ ఒకే దిశలో కదులుతుండడంవల్లనే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ప్యాసింజర్‌ రైలు బోగీ గూడ్సు రైలు పైకి ఎక్కడం ప్రమాద తీవ్రతను సూచిస్తోంది.

రెడ్ సిగ్నల్ జంప్..

అయితే ప్యాసెంజర్ ట్రైన్ రెడ్ సిగ్నల్ ను చూడకుండా...దానిని జంప్ చేయడం వల్లనేప్రమాధం జరిగిందని రైల్వే బోర్డు ప్రాథమికంగా అంచనా వేస్తోంది. దీనిపై రైల్వే భద్రతా కమిషనర్ స్థాయిలో విచారణ నిర్వహిస్తామని తెలిపింది. దాంతో పాటూ మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడినవారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.లక్ష సాయం అందించనున్నట్లు తెలిపింది.

Advertisment
తాజా కథనాలు