Tejashwi Yadav : రూ.30 వేల జీతం, గవర్నమెంట్ జాబ్.. తేజస్వీ భారీ హమీ

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు తేజస్వి యాదవ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళా సంఘాల సభ్యులను శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను చేస్తామని హామీ ఇచ్చారు.

New Update
rjd

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు తేజస్వి యాదవ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళా సంఘాల సభ్యులను శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం వారికి లభిస్తున్న గౌరవ వేతనాన్ని గణనీయంగా పెంచి, ప్రతినెలా రూ.30,000 జీతం ఇస్తామని హామీ ఇచ్చారు.లోన్లపై వడ్డీలు మాఫీ చేస్తామని, రాబోయే రెండు సంవత్సరాలకు వడ్డీ లేని రుణాల ఇస్తామని  ప్రకటించారు. జీవికా దీదీలకు ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తామని కూడా ఆయన చెప్పారు. తమ కూటమి అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోపే జీవికా దీదీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు అవసరమైన చట్టాన్ని రూపొందిస్తామని తేజస్వీ యాదవ్ పట్నాలో జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం

అధికారంలోకి వస్తే వివిధ రాష్ట్ర విభాగాలలో పనిచేస్తున్న అన్ని కాంట్రాక్టు కార్మికులకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయని హామీ ఇచ్చారు.కాంట్రాక్టు కార్మికులు వివిధ సంస్థల ద్వారా శారీరక, మానసిక, ఆర్థిక దోపిడీకి గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ కొత్త హామీతో బీహార్ ఎన్నికల రాజకీయం మరింత వేడెక్కింది. ఎన్డీఏ ఈ తాజా హామీపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా ఇప్పటికే బీహార్‌లో ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లోపు ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని తేజస్వి యాదవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి రెండు దశల్లో నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి

Advertisment
తాజా కథనాలు