మధుమేహాన్ని నియంత్రించాలంటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. దీని కోసం రోగులు కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి.. లేకపోతే వారి రక్తస్థాయిలు రెట్టింపు అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
డయాబెటిక్ రోగులు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఆహారం, పానీయాలు, కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ పేషెంట్లలో షుగర్ లెవల్స్ తగ్గాలంటే చక్కెర, తీపి ఆహారాలు తినడం మానేయాలి.
మధుమేహ రోగులు ధూమపానం, అతిగా మద్యపానం చేయడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. డయాబెటిక్ పేషెంట్లు దీనిని నివారించాలని సూచించారు
ఎక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాలు తింటే రక్తంలో చక్కెర పరిమాణం రెండు రెట్లు పెరుగుతుంది. కార్బోహైడ్రేట్ ఆహారంలో చక్కెర, కొవ్వు అధికంగా ఉంటే ఖచ్చితంగా చక్కెరను త్వరగా పెంచుతుంది.
ఉదయం ఖాళీ కడుపుతో పని చేయడం, అల్పాహారం మానేయడం సమస్యాత్మకం. డయాబెటిక్ పేషెంట్లు అల్పాహారాన్ని ఎప్పుడూ మానేయకూడదు. పొద్దున్నే కాస్తయినా కడుపు నిండాలి. ఉదయం ఖాళీ కడుపుతో షుగర్ పెరుగుతుంది.
తగినంత నిద్ర లేకపోవటం, రాత్రి ఆలస్యంగా పడుకోవటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. మధుమేహం లేని వారు కూడా తగినంత నిద్రపోకపోతే వ్యాధిని వస్తుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.