Lion: జంతువులు మనుషుల కంటే ఎంతో విశ్వాసంగా ఉంటాయి. శునకాల సంగతి అయితే ఇక చెప్పక్కర్లేదు. పెంపుడు జంతువుల సంగతి ఇలా ఉంటే.. క్రూర మృగాలను చూస్తే మనుషులు వణికి పోతారు. సింహాలు, పులులు అంటే ఆమడ దూరం పరిగెత్తుతారు. కానీ వేటాడడమే కాదు తాము ప్రేమించగలమని, మమకారం చూపించగలమని రుజువు చేస్తున్నాయి కొన్ని సింహాలు. చాలా రోజుల తర్వాత ఓ సంరక్షకుడు సింహం ఉండే బోను దగ్గరికి వెళ్ళాడు. రక్షకునిపై ప్రేమను ప్రదర్శించిన సింహం: అతనితో ఆ సింహం చూపించే ప్రేమ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. హృదయాలు కదిలించి వేస్తుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఓ వినియోగదారు ఈ వీడియో పోస్ట్ చేశాడు. సింహాన్ని కలవడానికి ఒక వ్యక్తి గేటు తెరవడం మనం చూడవచ్చు. ఆ తర్వాత సింహం తన రక్షకునిపై ప్రేమను ప్రదర్శించింది. వీడియో త్వరగా ప్రజాదరణ పొందింది, 10 మిలియన్లకుపైగా వీక్షణలు, అనేక లైక్‌లు, షేర్‌లను పొందింది. Also Read: ఎక్కువ సేపు పడుకుంటున్నారా..? మీ పని అంతే సింహం రక్షకుని వైపు సింహం ఆనందంగా పరుగెత్తుతూ వెళ్లి అతనితో ఆడుకోవడం చూస్తుంటే ఇద్దరి మధ్య ఎంత లోతైన బంధం ఉందో తెలుస్తుంది. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోపై వ్యాఖ్యానిస్తూ ఇద్దరు మొత్తానికి మళ్ళీ కలుసుకున్నందుకు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి.. వైల్డ్‌గా కనిపించే సింహం ఇంత ప్రేమ చూపిస్తుందా అంటూ కామెంట్ చేశాడు. Also Read: Mohan Babu: హైకోర్టుకు మోహన్ బాబు! Lion's reaction to seeing her rescuer, who helped raise her as a cub❤️ pic.twitter.com/NLgQxof7f8 — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) December 10, 2024 గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. Also Read: అల్పాహారం, రాత్రి భోజనం మానేస్తున్నారా..? ఈ సమస్యలు తప్పవు Also Read: ఈ వస్తువులతో పాములు పరార్.. వాసన వల్ల మళ్లీ కనిపించవు