Atul Subhash: అతుల్ సుభాష్ కేసులో కోర్టు సంచలన తీర్పు

బెంగళూరు టెకీ అతుల్ సుభాశ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే తమ నాలుగేళ్ల మనువడిని తమ కస్టడీకి అప్పగించాలని ఇటీవలే అతుల్ తల్లి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు.. బాలుడు తల్లి వద్దే ఉంటాడని తీర్పునిచ్చింది.

New Update
Atul Subhash case

Atul Subhash case

భార్య వేధింపుల వల్ల బెంగళూరు టెకీ అతుల్ సుభాశ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే తమ నాలుగేళ్ల మనువడిని తమ కస్టడీకి అప్పగించాలని ఇటీవలే అతుల్ తల్లి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. బాలుడు తల్లి వద్దే ఉంటాడని తీర్పునిచ్చింది. విచారణ సందర్భంగా జస్టిస్‌ బివి. నాగరత్న, జస్టిస్‌ ఎస్‌సీ. శర్మ వీడియో కాల్‌లో బాలుడిని చూశారు. ఆ బాబుతో మాట్లాడారు. ఆ తర్వాత కోర్టు తీర్పు వెలువరించింది. 

Also Read: దారుణం.. పనికి రానందుకు ముగ్గురు దళితులపై విచక్షణారహితంగా దాడి..

ఆ బాలుడు తన తల్లి వద్దే ఉంటాడని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు సమర్పించేందుకు మరో వారం రోజులు గడువు ఇవ్వాలని బాలుడి నాయనమ్మ తరఫు న్యాయవాది కోరారు. కానీ ఇందుకు కోర్టు తిరస్కరించింది. ఇదిలాఉండగా.. భార్య వేధింపులు తాళలేక ఇటీవల బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్న అతుల్ సుభాశ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. 

Also Read: సైఫ్‌పై దాడి జరిగేటప్పుడు నలుగురు మగ పనిమనుషులు అక్కడే.. వెలుగులోకి సంచలన నిజాలు

ఈ ఆత్మహత్యకు తన భార్యే కారణం అని సూసైడ్ చేసుకునే ముందు 80 నిమిషాల వీడియో కూడా చేశాడు. ఘటన జరిగిన తర్వాత అతుల్ భార్య నిఖితా సింఘానియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు తన తల్లి నిషా, సోదరుడు అనురాగ్‌లను కూడా అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం తన మనుమడిని దక్కించుకునేందుకు అతుల్ తల్లి కోర్టులో పొరాడుతున్నారు. తమ మనువడిని తమ కస్టడీకీ అప్పగించాలని కోరగా.. తాజాగా సుప్రీంకోర్టు నిరాకరించింది.   

Also Read: ఆప్‌ డాక్యుమెంటరీ వీడియో లీక్ చేసిన ధ్రువ్‌ రాఠీ.. బ్యాన్ అవ్వకముందే చూడాలని సూచన

Advertisment
తాజా కథనాలు