ఔరా అనిపించే ఘటన..వాట్సాప్‌లో సలహాలు, ప్రెగ్నెంట్ భార్యను ఏం చేశాడంటే!

దేశమే ఔరా అనిపించే ఘటన తమిళనాడులో జరిగింది. ఓ భర్త తన భార్యకు ఇంట్లోనే డెలివరీ చేశాడు. వాట్సాప్ గ్రూప్‌లో పలువురి సలహాలతో తన భార్యకు పురుడు పోశాడు. ఈ విషయం రీజియన్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‎కు తెలియడంతో అతడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

New Update
baby delivered with WhatsApp advice

వాట్సాప్ అంటే చాలా మంది చాటింగ్, వీడియో కాల్, ఆడియో కాల్, మెసేజ్ చేసుకోవడమే అనుకుంటారు. కానీ వాట్సాప్ ద్వారా ప్రాణం కూడా పొయ్మొచ్చు అని ఎంతమందికి తెలుసు. అవును మీరు విన్నది నిజమే. తాజాగా ఓ మహిళ ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. వాట్సాప్ గ్రూప్‌లో పలువురు సూచనలు, సలహాల మేరకు ఆమె భర్త ఇంట్లోనే భార్యకు డెలివరీ చేశాడు. ఈ ఘటనతో యావత్ దేశమే ఔరా అంటుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇది కూడా చదవండి: నకిలీ RTO ఘరానా మోసం.. ఈ ట్విస్టు ఊహించడం కష్టమే భయ్యా!

విపరీతంగా పురిటి నొప్పులు

తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన మనోహరన్, అతడి భార్య సుకన్య దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరు కుండ్రత్తూరు సమీపంలోని నందంబాక్కంలో నివాసముంటున్నారు. ఇక సుకన్య మూడోసారి గర్భవతి అయింది. ఇందులో భాగంగానే ఆమెకు నెలలు నిండటంతో 2024 నవంబర్ 17 విపరీతంగా పురిటి నొప్పులు వచ్చాయి. 

ఇది కూడా చదవండి: తెలంగాణలో 13 నర్సింగ్ కాలేజీలకు అనుమతి

ఇంట్లోనే డెలివరీ

దీంతో మనోహర్ తన భార్యకు ఇంట్లోనే డెలివరీ చేయాలని ముందుగానే ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే తన భార్యను హాస్పిటల్‌కు తీసుకెళ్లకుండా ఇంట్లోనే పురుడు పోసాడు. ‘హోమ్ బర్త్ ఎక్స్‌పీరియన్స్’ పేరుతో 1000 మందికి పైగా సభ్యులు ఉన్న వాట్సాప్ గ్రూప్‌లోని కొందరి సూచనలు, సలహాలతో తన భార్యకి ఇంట్లోనే డెలివరీ చేశాడు. 

కేసు నమోదు

ఈ విషయం రీజియన్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌కు తెలియడంతో ఆయన షాక్ అయ్యాడు. వెంటనే కుండ్రత్తూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైద్య భద్రతా నిబంధనలు పాటించలేదని మనోహర్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు మనోహర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు ‘హోమ్ బర్త్ ఎక్స్‌పీరియన్స్’ అనే వాట్సాప్ గ్రూప్‌లోని సలహాల మేరకు మనోహర్ తన భార్యకు డెలివరీ చేశాడని పోలీసుల విచారణలో తేలింది. ఆపై పోలీసులు మనోహర్‌ను కాస్త మందలించారు. ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని హెచ్చరించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు