క్వాలిటీ ఫుడ్ అందించేందుకు.. స్విగ్గీ సరికొత్త ప్లాన్ !

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. పరిశుభ్రత, ఆహార నాణ్యత ప్రమాణాలు ధ్రువీకరించేదుకు 'సీల్‌ బ్యాడ్జ్‌'ను తీసుకొచ్చింది. ఆహార నాణ్యత విషయంలో రెస్టరెంట్లకు కస్టమర్లు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ బ్యాడ్జ్‌ను జారీ చేస్తారు.

Swiggy
New Update

ఈ మధ్య రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్‌కోర్టుల్లో సోదాలు జరగడం, కల్తీ ఆహారం బయటపడటం లాంటి అంశాలు వెలుగుచూస్తున్నాయి. దీంతో ఆహార ప్రియుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. పరిశుభ్రత, ఆహార నాణ్యత ప్రమాణాలు ధ్రువీకరించేదుకు 'సీల్‌ బ్యాడ్జ్‌'ను తీసుకొచ్చింది. ప్రస్తుతం పుణెలో అందుబాటులో ఉన్నటువంటి ఈ సేవలను.. నవంబర్‌ నాటికి 650 నగరాలకు విస్తరిస్తామని ప్రకటిచింది. 

Also Read: కేటీఆర్‌కు బిగ్ షాక్.. అట్రాసిటీ కేసు నమోదు !

మంచి స్పందన వస్తోంది

ఈ సరికొత్త ఆలోచనకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపింది. ఇప్పటికే వందలాది రిక్వెస్టులు కూడా వచ్చాయని స్విగ్గీ పేర్కొంది. పరిశుభ్రమైన ఆహారం, నాణ్యత ప్రమాణాలు అలాగే మంచి ప్యాకింగ్ ప్రమాణాలు పాటిస్తున్నటువంటి రెస్టరెంట్లకు కస్టమర్లు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ బ్యాడ్జ్‌ను జారీ చేస్తారు. రెస్టరెంటర్లలో పరిశుభ్రత గురించి 70 లక్షల మంది కస్టమర్ల నుంచి వచ్చిన అభిప్రాయాల నంచే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.    

Also Read: భారత్‌లోకి స్టార్‌లింక్.. అంబానీకి చెక్ పెట్టనున్న ఎలాన్‌ మస్క్‌ !

వాటితో భాగస్వామ్యం

పరిశుభ్రతకు సంబంధించి ఆడిట్‌ను నిర్వహించడం కోసం FSSAI గుర్తింపు పొందిన సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని తెలిపింది. అలాగే రెస్టరెంట్లకు అందుబాటు ధరలో ఆడిట్ సేవలు అందిస్తామని చెప్పింది. ఇక బ్యాడ్జ్ తీసుకున్న తర్వాత కస్టమర్ల నుంచి రెస్టరెంట్‌పై ఫిర్యాదులు వస్తే దాన్ని తొలగిస్తామని పేర్కొంది. తాము అందించే సేవల్లో పరిశుభ్రత విషయంలో ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకునేందుకు ఈ విధానంతో వీలు కలుగుతుందని తెలిపింది.  

 

#telugu-news #national-news #swiggy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe