స్పెషల్ లెర్నింగ్ డిజార్డర్, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, మానసిక వ్యాధులు ఉన్నవారు 40 శాతం ఉంటే ఎంబీబీఎస్ కోర్సుకు అనర్హులు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ యువకుడు ఇటీవల కోర్టులో కేసు వేయగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. తనకి 55 శాతం మానసిక వైకల్యం ఉందని వైద్య కళాశాలలో జాయిన్ కావడానికి అనర్హుడని యాజమాన్యం తెలిపింది. దీంతో అతను కోర్టును ఆశ్రయించాడు.
ఇది కూడా చూడండి: Stock Markets: లాభాల వద్ద ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
తక్కువగా చూడలేమని..
ఎస్‌ఎల్‌డి, ఎఎస్‌డితో బాధపడుతున్న వ్యక్తులను తక్కువగా చూడలేమని, కోటా ప్రయోజనాలను తిరస్కరించలేమని అభ్యర్థి తరఫు న్యాయవాది వాదించారు. దీంతో సుప్రీంకోర్టు నిబంధనలకు కాస్త తక్కువగా వైకల్యం ఉండటం వల్ల వైద్య అభ్యసించకూడదని అనడానికి కారణం కాదని తెలిపింది. ప్రభుత్వం ఆమోదించిన 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉంటేనే వైద్య విద్యలో చేర్చుకోవాలని రూల్ ఉంది. దీంతో విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించగా తీర్పునిచ్చింది.
ఇది కూడా చూడండి: సిల్వర్ స్క్రీన్ పై షణ్ముఖ్ ఎంట్రీ .. లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజ్, విశ్వక్ సేన్ ఫొటోలు వైరల్!
ఎంబీబీఎస్ కోర్సు చదవడానికి ఆ విద్యార్థి చదవడానికి అసమర్థుడు అని బోర్డు నుంచి నివేదిక ఉండాలి. లేకపోతే వారు అనర్హుడు అని నిర్ణయించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల విధివిధానాలు వికలాంగులకు ఉపయోగపడేలా, సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. అంతే కానీ వారు దేనికి పనికి రారనే విధంగా ఉండకూడదని సుప్రీంకోర్టు తెలిపింది.
ఇది కూడా చూడండి: AP Government: ఆ మంత్రులకు చంద్రబాబు కీలక బాధ్యతలు
దేశంలో ఎందరో వికలాంగులు విజయాలు సాధించారని ఉదాహరణగా సుప్రీంకోర్టు తెలిపింది. ఖాళీగా ఉంచిన సీటులో అభ్యర్థిని వైద్య విద్యలో చేర్చుకోవాలని కోర్టు ఆదేశించింది. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వ్యక్తులు ఎంబీబీఎస్ కోర్సును అభ్యసించడానికి అర్హులు కాదని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఉంది. అయితే గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఎంబీబీఎస్ విద్యార్థి కోర్టులో పిటిషన్ వేయగా.. సుప్రీం కోర్టు ఇలా తీర్పునిచ్చింది.
ఇది కూడా చూడండి: Bharat: ఇండియా-కెనడా యుద్ధం.. మధ్యలో బిష్ణోయ్.. వివాదానికి కారణమేంటి?