/rtv/media/media_files/shanmukh-jaswant-5.jpg)
యూట్యూబర్ గా కెరీర్ స్టార్ చేసిన షణ్ముఖ్.. మొదట్లో వైవా వీడియోలు చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ డెవ్‌లవ్‌పర్, సూర్య వంటి వెబ్ సీరీస్ లతో షన్ను ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. Image Credits: Shanmukh Jaswant/ Instagram
/rtv/media/media_files/shanmukh-jaswant-3.jpg)
ఇన్‌స్టా గ్రామ్ లో 2 మిలియన్ ఫాలోవర్స్ , యూట్యూబ్ లో 4 మిలియన్ పైగా ఫాలోవర్లతో పాపులర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. Image Credits: Shanmukh Jaswant/ Instagram
/rtv/media/media_files/shanmukh-jaswant-2.jpg)
ఇప్పటివరకు వెబ్ సీరీస్, యూట్యూబ్ వీడియోలతో సత్తా చాటిన షన్ను హీరోగా వెండితెరపై అలరించడానికి సిద్దమయ్యాడు. దసరా పండగ రోజున షణ్ముఖ్ హీరోగా అరంగేట్రం చేయనున్న తొలి చిత్రాన్ని పూజ కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ చేశారు. ఈ చిత్రానికి భీమా శంకర్ దర్శకత్వం వహించనున్నారు. Image Credits: Shanmukh Jaswant/ Instagram
/rtv/media/media_files/shanmukh-jaswant-1.jpg)
ఈ మూవీ లాంచ్ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ పాల్గొన్నారు. నిర్మాత దిల్ రాజ్ క్లాప్ ఇవ్వగా.. విశ్వక్ సేన్ బౌండ్ స్క్రిప్ట్‌ను దర్శకుడికి బౌండ్ స్క్రిప్ట్ ను అందజేశారు. ఈ సందర్భంగా మేకర్స్ మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. Image Credits: Shanmukh Jaswant/ Instagram
/rtv/media/media_files/j7EjZoGIqtc1VXFgpg05.jpg)
లక్కీ మీడియా, ఏబీ సినిమాస్ బ్యానర్స్ పై బెక్కెం వేణుగోపాల్, అనిల్ కుమార్ రావాడ, భార్గవ్ మన్నె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తారాగణం, ఇతర సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని ప్రకటించారు. Image Credits: Shanmukh Jaswant/ Instagram
/rtv/media/media_files/shanmukh-jaswant-3.jpg)
ఈ లాంచ్ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన షణ్ముఖ్..''నా జీవితంలో అతి పెద్ద అడుగు వేయడానికి మీ అందరి ఆశీర్వాదం కావాలి'' అంటూ పోస్ట్ పెట్టాడు. Image Credits: Shanmukh Jaswant/ Instagram
/rtv/media/media_files/nIxzjS9sRr6JykW20VWY.jpg)
బిగ్ బాస్ షో తర్వాత.. బ్రేకప్, డ్రగ్స్ కేసు అంటూ వివాదాలతో చుట్టుముట్టిన షన్ను.. ఇప్పుడు వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వడం అతని ఫ్యాన్స్ కు ఆనందం కలిగిస్తోంది. షన్ను ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే అతనికి.. విషెష్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. Image Credits: Shanmukh Jaswant/ Instagram