వివాహేతర సంబంధం తప్పుకాదు కానీ.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు! వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇరువురు ఇష్టంతో శృంగారంలో పాల్గొనడం తప్పు కాదని చెప్పింది. విడిపోయిన తర్వాత రేప్ కేసు పెడితే చెల్లదని స్పష్టం చేసింది. ముంబైలో ఏడేళ్ల క్రితం ఓ వ్యక్తిపై వితంతువు పెట్టిన రేప్ కేసును కొట్టివేసింది. By srinivas 28 Nov 2024 | నవీకరించబడింది పై 28 Nov 2024 18:31 IST in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Suprem court: వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లి తర్వాత వివాహిత తన ఇష్టంతో మరో పురుషుడితో శృంగారంలో పాల్గొంటే తప్పుగా పరిగణించలేమని తెలిపింది. ఈ మేరకు ముంబై ఖర్గార్ స్టేషన్ లో ఏడేళ్ల క్రితం ఓ వ్యక్తిపై వితంతువు పెట్టిన రేప్ కేసును విచారించిన ధర్మాసనం.. అది తప్పుడు కేసుగా పేర్కొంటూ కొట్టివేసింది. ఈ సందర్భంగా రిలేషన్ బాగున్నప్పుడు కొంతకాలం శృంగారంలో పాల్గొని.. ఆ తర్వాత విడిపోతే కక్ష్యతో రేప్ కేసులు పెట్టడం సరికాదని, ఇది పురుష సమాజానికి ఆందోళన కలిగించే అంశమని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం పేర్కొంది. ఇక కొంతమంది పెళ్లి చేసుకుంటామనే ఒప్పందంతోనే సన్నిహితంగా ఉంటారని కచ్చితంగా చెప్పలేమని స్పష్టం చేసింది. ఐపీసీ సెక్షన్ 497 కొట్టేవేత.. ఇదిలా ఉంటే.. వివాహేతర సంబంధంపై గతంలో సుప్రీం కోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. భర్తకు మహిళ వ్యక్తిగత ఆస్తి కాదని, వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్ 497ను కొట్టేసిన విషయం తెలిసిందే. 2018 సెప్టెంబర్ లో వెలువడిన ఈ తీర్పు ప్రకారం మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్ 497కు కాలం చెల్లిందని, అది రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం తెలిపింది. ఇది కూడా చదవండి: వచ్చేసిన నరేష్ బచ్చల మల్లి టీజర్.. ఈసారి గట్టిగానే ప్లాన్ చేశాడుగా.. బ్రిటిష్ కాలం నాటి వ్యభిచార వ్యతిరేక చట్టం మహిళలను మగవారు తమ సొంత ఆస్తిగా పరిగణించేలా ఉందని తెలిపింది. ఇది వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని అభిప్రాయపడింది. ఇష్టంతో శృంగారంలో పాల్గొనడం మహిళల హక్కు కాబట్టి ఆమెకు షరతులు విధించలేం. వివాహేతర సంబంధం నేరం కాకపోయినా, నైతికంగా తప్పు. దీనిని కారణంగా చూపి విడాకులు తీసుకోవచ్చు అని ధర్మాసనం తెలిపింది. ఇది కూడా చదవండి: Maharashtra Elections: మీ కూటమికో దండం..కాంగ్రెస్ కు శివసేన బిగ్ షాక్? #supreme-court #extra-marital-relations మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి