ప్రతీ సంవత్సరం శీతాకాలం వస్తుందంటే చాలు.. ఉత్తర భారత్‌లో గాలి నాణ్యత తగ్గుతుంది. ముఖ్యంగా దేశ రాజధానీ ఢిల్లీలో దీని పరిస్థితి మరింత దిగజారుతుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీనిపై మీడియాలో వార్తలు వస్తుంటాయి, చర్చలు, విమర్శలు వస్తుంటాయి. ఆ తర్వాత దీన్ని ఎవరూ పట్టించుకోరు. మరో ఏడాది మళ్లీ ఇలాంటి పరిస్థితే నెలకొంటుంది. అయితే ఈ అంశంపై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
Also Read: మహావికాస్ అఘాడి VS మహాయుతి.. కొలిక్కి వచ్చిన సీట్ల పంపకాలు !
కేంద్రంపై సీరియస్
ఈ వ్యవహారంపై అత్యన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. పంట వ్యర్థాలు తగలబెట్టడం సమస్య ఏటా రావండతో దీనిపై కఠిన చట్టాలు రూపొందించకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. పర్యావరణ చట్టాల్లో సవరణలు చేసి ఎలాంటి ప్రభావం చూపించనివాటిగా మార్చారని తెలిపింది. పంట వ్యర్థాలను తగలబెట్టేవారిపై కఠిన చర్యలకు సంబంధించి కొత్త రూల్స్‌ను 10 రోజుల్లోనే తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
సీఏక్యూఎం విఫలం
గాలికాలుష్యాన్ని నియంత్రించడంలో 'కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మెనేజ్‌మెంట్' (CAQM) విఫలమైంది. ఈ అంశంపై కూడా సుప్రీంకోర్టు కమిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాల సమస్యను పరిష్కరించేందుకు కనీసం ఒక్క కమిటీని కూడా ఏర్పాటు చేయాలేదని ధ్వజమెత్తింది. ప్రతీ ఏడాది ఈ సమస్యను చూస్తుంటే సీఏక్యూఎం చట్టం అమలు కావడం లేదని అర్థమవుతోందని పేర్కొంది. కమీటీలు ఏర్పాటు చేసి చట్టం ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఒక్కటైనా చూపించండి అంటూ మండిపడింది. ఢిల్లీ ఎన్సీఆర్ రాష్ట్రాలకు గతంలో చెప్పినవన్నీ కూడా గాల్లో మాటలుగానే మిగిలిపోయినట్లు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. మీరు మాత్రం మౌన ప్రేక్షకులగా ఉండిపోయారని సీఏక్యూఎంను నిలదీసింది.
Also Read: చంద్రబాబు, స్టాలిన్ వింత సందేశాలు.. పిల్లలను కనడంపై ఈ సీఎంల లాజిక్ కరెక్టేనా?
వాయు నాణ్యత వాతావరణ అంచనా పరిశోధ (SAFAR) డేటా ప్రకారం చూసుకుంటే మంగళవాం ఢిల్లీలో ఉదయం 8 గంటలకు గాలి నాణ్యత సూచి (AQI) 317గా నమోదైంది. అంటే అక్కడ చాలా తీవ్రమైన స్థాయిలో గాలినాణ్యత దిగజారిపోయింది. గాలి నాణ్యత 0-50 మధ్య ఉంటే సంతృప్తికరమైందిగా భావిస్తారు. 51-100 మధ్య ఉంటే ఆమోదయోగ్యంగా, 101 -200 మధ్య ఉంటే మోస్తరు, 201 నుంచి 200 మధ్య ఉంటే డేంజర్‌గా పరిగణిస్తారు. ఇక 300-500 మధ్య అత్యంత ప్రమాదరంగా భావిస్తారు. ఢిల్లీలో 317గా ఏక్యూఐ నమోదం కావడంతో అక్కడి గాలి నాణ్య ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. గత కొన్నేళ్లుగా ఇలాంటి పరిస్థితులే వస్తున్నాయి. అయినప్పటికీ ఈ సమస్యకు ఇంతవరకు పరిష్కారం దొరకకపోవడం గమనార్హం.