మత విద్వేషానికి మానవత్వం బ్రేక్‌లు.. మొన్న దీపక్, నిన్న కోవాబన్ వలీ

కొందరు సమాజంలో మత విద్వేషాలను రెచ్చగొట్టాలని ఎంత ప్రయత్నించినా మానవత్వం దానికి బ్రేక్‌లు వేసింది. బెస్ట్ ఎగ్జామ్‌పుల్ చెప్పాలంటే మేడారంలో కోవా బన్ అమ్ముకునే వలీ స్టోరీ అనే చెప్పుకోవాలి. ఇలాంటి ఘటనే రెండు వారాల క్రితం ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది.

New Update
religious harmony

కొందరు సమాజంలో మత విద్వేషాలను రెచ్చగొట్టాలని ఎంత ప్రయత్నించినా మానవత్వం దానికి బ్రేక్‌లు వేసింది. బెస్ట్ ఎగ్జామ్‌పుల్ చెప్పాలంటే మేడారంలో కోవా బన్ అమ్ముకునే వలీ స్టోరీ అనే చెప్పుకోవాలి. ఇలాంటి ఘటనే రెండు వారాల క్రితం ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. మానవత్వంతో ఒక ముస్లిం వృద్ధుడిని కాపాడినందుకు దీపక్ కుమార్ అనే జిమ్ యజమాని ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తన పేరు మహమ్మద్ దీపక్‌గా ప్రకటించుకుని మత సామరస్యాన్ని చాటిన ఆయనపై స్థానికులు ఆర్థిక బహిష్కరణ చేశారు. ఆయన జిమ్ సభ్యుల సంఖ్య 150 నుండి కేవలం 15కు పడిపోయింది. మానవత్వానికి మతం రంగు పులిమిన ఈ సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఏం జరిగిందంటే?

జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని కోట్‌ద్వార్ పట్టణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. 'బాబా స్కూల్ డ్రస్' అనే దుకాణాన్ని నడుపుతున్న 70 ఏళ్ల వకీల్ అహ్మద్‌ను కొందరు వ్యక్తులు చుట్టుముట్టారు. దుకాణం పేరులో ఉన్న 'బాబా' అనే పదాన్ని తొలగించాలని, అది హిందూ మతానికి సంబంధించినదని వారు వాదించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న 38 ఏళ్ల జిమ్ ట్రైనర్ దీపక్ కుమార్ జోక్యం చేసుకున్నారు.

వృద్ధుడికి సపోర్ట్‌గా పేరు తీసేయాలని బెదిరించిన వారిని దీపక్ నిలదిశాడు. మతవిద్వేషాలు రెచ్చగొట్టాలని చూసిని వారికి ఊహించని సమాధానం ఇచ్చారు. "నా పేరు కూడా మహమ్మద్ దీపక్" అని ప్రకటించి, మతాల కంటే మానవత్వం ముఖ్యమని చాటారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.

దీపక్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. ఆయన నడుపుతున్న 'హల్క్ జిమ్'పై స్థానికంగా వ్యతిరేకత మొదలైంది. అంతకుముందు 150 మంది సభ్యులతో కళకళలాడిన జిమ్, ఇప్పుడు వెలవెలబోతోంది. ప్రస్తుతం కేవలం 12 నుండి 15 మంది మాత్రమే జిమ్‌కు వస్తున్నారు.

దీపక్ ఆవేదన

"నేను చేసిన పనికి గర్వపడుతున్నాను కానీ, దాని కారణంగా నా జీవనోపాధి దెబ్బతింది. నెలకు రూ.40,000 అద్దె, రూ.16,000 హోమ్ లోన్ ఈఎంఐ చెల్లించడం ఇప్పుడు భారం అయింది. నిజాయితీగా ఉన్నందుకు నేను ఈ మూల్యం చెల్లిస్తున్నాను" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అండగా నిలుస్తున్న నెటిజన్లు

దీపక్ పరిస్థితిని తెలుసుకున్న పలువురు సామాజిక కార్యకర్తలు, సుప్రీంకోర్టు న్యాయవాదులు ఆయనకు మద్దతుగా ముందుకు వస్తున్నారు. సుమారు 15 మంది సీనియర్ లాయర్లు ఆయన జిమ్‌లో సభ్యత్వాలు తీసుకుని ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటూ సహాయం చేయడానికి చాలా మంది ముందుకొస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు