Lokesh: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌..ఇక నుంచి మధ్యాహ్నా భోజనం

ఏపీ మంత్రి లోకేశ్‌ గవర్నమెంట్‌ కాలేజీల్లో అటెండెన్స్‌ ,విద్యా ప్రమాణాలను మరింత పెంచడం కోసం మరో ప్రతిష్టాత్మక నిర్ణయాన్నితీకున్నారు.ఇక నుంచి ఇంటర్‌ విద్యార్థులకు కూడా మధ్యాహ్నా భోజనం అందించాలని నిర్ణయించారు.

New Update
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై లోకేష్ కీలక ప్రకటన

AP Minister Lokesh: ఏపీలోని గవర్నమెంట్‌ కాలేజీల్లో అటెండెన్స్‌ ,విద్యా ప్రమాణాలను మరింత పెంచడం కోసం మంత్రి నారా లోకేష్‌ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక నుంచి ఇంటర్‌ విద్యార్థులకు కూడా మధ్యాహ్నాభోజనం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లి  నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యా శాఖ ఉన్నతాధికారులతో  మంత్రి నారా లోకేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. 

Also Read: lucknow airport: ప్లాస్టిక్ బాక్స్‌లో నెలరోజుల బేబీ.. ఫ్లైట్‌లో కొరియర్..!

ఈ సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ... పదో తరగతి పూర్తిచేసిన పేద విద్యార్థుల్లో చాలామంది చదువు మానేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఇంటర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం కల్పించడంతో  డ్రాపౌట్స్ ను కొంతమేర తగ్గించే అవకాశాలున్నాయని అన్నారు. 

Also Read: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ జిల్లాల్లో వైన్‌షాప్‌లు బంద్!

విద్యార్థులకు ముందు నుంచే..

ఇంటర్‌లో వెనుకబడిన విద్యార్థులకు ముందు నుంచే క్వశ్చన్ బ్యాంక్ అందించాలని తెలిపారు. సంకల్ఫ్ ద్వారా చేపట్టిన ఇంటర్ విద్యార్థుల ఎసెస్ మెంట్ ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, ఆ కాలేజీ లెక్చరర్లు, సిబ్బందిని కేర్ టేకర్స్ గా నియమించాలని చెప్పారు.

Also Read: Tamil Nadu: మంత్రిపై బురద చల్లిన వరద బాధితులు.. వీడియో వైరల్

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో బాగా దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేపట్టాలని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ 7న నిర్వహించే మెగా పేరెంట్-టీచర్ సమావేశాలను ఏర్పాటు చేయాలని మంత్రి అన్నారు. మంత్రులు, శాసనసభ్యులు వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లోనే మెగా పీటీఎం సమావేశాలకు హాజరు కావాలని చెప్పారు. ఎటువంటి పార్టీ జెండాలు, ఆర్భాటాలకు పోవద్దని తెలియజేశారు.

Also Read: సౌత్ కొరియాలో 'ఎమర్జెన్సీ మార్షియల్ లా' ప్రకటించిన అధ్యక్షుడు

బాపట్ల ప్రభుత్వ హైస్కూలులో నిర్వహించే మెగా పీటీఎం నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు తాను కూడా వస్తున్నట్లు లోకేశ్ వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల మెరుగుదల, మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని సమావేశంలో చెప్పారు. ఇందుకోసం 18 అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలని మంత్రి సూచించారు.

ముఖ్యంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే పాఠ్యాంశాల కోసం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సలహాలు తీసుకోవాలని మంత్రి అధికారులకు చెప్పారు. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు