/rtv/media/media_files/2025/02/03/hXS1FKTYbWFTLh6ZW92E.jpg)
sonia gandhi
కాంగ్రెస్ సీనియర్ లీడర్, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీకి బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇటీవల ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. ఈ ప్రసంగం అనంతరం రాష్ట్రపతిని ఉద్దేశించి ఎంపీ సోనియా గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎంపీలు ఆరోపించారు. దీంతో బీజేపీ ఎంపీల బృందం సోమవారం సోనియా గాంధీపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌కు సభాహక్కుల నోటీసు ఇచ్చారు. సోనియా చేసిన కామెంట్స్ అత్యున్నత పదవి గౌరవాన్ని తగ్గించే విధంగా ఉన్నాయని ఎంపీలు తమ నోటీసులో ఆరోపించారు. ఇటువంటి వ్యాఖ్యలు కార్యాలయ గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా పార్లమెంటరీ విధానాలు, సమావేశాల పవిత్రతను కూడా ఉల్లంఘిస్తాయన్నారు.
సోనియా గాంధీ ఏమన్నారంటే
బడ్జెట్ సమావేశాల ప్రసంగం అనంతరం రాష్ట్రపతిని పేద మహిళ అంటూ పెద్ద వివాదానికి తెర లేపారు సోనియా గాంధీ. రాష్ట్రపతి తన ప్రసంగం పాఠాన్ని చివరి వరకు కొనసాగించలేకపోయారని, అలసిపోయారని పూర్ అంటూ కామెంట్ చేశారు. దీంతో ఇది వివాదాస్పదంగా మారింది. సోనియా గాంధీ కామెంట్స్ ను రాష్ట్రపతి కార్యాలయం ఖండించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు.. రాష్ట్రపతి పదవికి ఉన్న గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని వెల్లడించింది.
అటు పీఎం మోదీ కూడా తీవ్ర విమర్శలు చేశారు. మొట్ట మొదటి గిరిజన మహిళా రాష్ట్రపతిని, ఓ సాధారణ మహిళలను ప్రత్యక్షంగా అవమానించడమేనంటూ మండిపడ్డారు. రాష్ట్రపతి పట్ల కాంగ్రెస్ అహంకారం, అగౌరవాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపించారు.
బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా కోర్టులో సోనియా గాంధీ వ్యాఖ్యలపై ఫిర్యాదు దాఖలైంది. ముజఫర్‌పూర్‌కు చెందిన సుధీర్ ఓజా అనే న్యాయవాది శనివారం గాంధీపై ఫిర్యాదు చేశారు, దేశ అత్యున్నత రాజ్యాంగ అధికారాన్ని అగౌరవపరిచినందుకు ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరారు. ఓజా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాలను సహ నిందితులుగా పేర్కొంటూ, వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read : కంగ్రాట్స్ మాస్టర్.. ప్రపంచ క్రికెట్‌కు మీరే స్పూర్తి: యువి పోస్ట్ వైరల్!