MBBS విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్

పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ స్టూడెంట్ పై జరిగిన సామూహిక అత్యాచారం దేశమంతటా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. అయితే ఈ కేసులో ఇప్పటికే మగ్గురిని ఆరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

New Update
case

పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ స్టూడెంట్ పై జరిగిన సామూహిక అత్యాచారం దేశమంతటా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. అయితే ఈ కేసులో ఇప్పటికే మగ్గురిని ఆరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు అతని సోదరి రోజినా ఇచ్చిన సమాచారంతోనే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని పట్టుకోవడానికి కుటుంబ సభ్యురాలే సహాయం చేయడం ఇప్పుడు ఈ కేసులో కీలక మలుపుగా మారింది. 

తన సోదరుడు చేసిన తప్పునకు తగిన శిక్ష అనుభవించాలనే ఉద్దేశంతోనే  పోలీసులకు తాను సమాచారం ఇచ్చినట్లు రోజినా మీడియాకు తెలిపింది. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులను బాధితురాలిని వెంటబెట్టుకుని వెళ్లిన స్నేహితుడిని కూడా విచారణ కోసం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులందరినీ కస్టడీలోకి తీసుకోవడంతో దర్యాప్తు పురోగతి సాధించింది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ముఖ్యంగా రాత్రి వేళ బయట తిరగవద్దని మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.  బీజేపీతో సహా ప్రతిపక్ష పార్టీలు ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి. 

ఇది కూడా చూడండి: BSNL Recharge Plan: రూ.99లకే బీఎస్‌ఎన్‌ఎల్ బంపరాఫర్.. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు అదిరిపోయే ప్లాన్స్

బాధితురాలు సంచలన విషయాలు

మరోవైపు అత్యాచార ఘటనపై బాధితురాలు సంచలన విషయాలు భయటపెట్టింది.  శుక్రవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లినప్పుడు కొంతమంది తమను వెంబడించారని తెలిపింది. వెంటనే తాము అడవి వైపు పరిగెత్తుతున్న సమయంలో తన స్నేహితుడు ఒకవైపు మరో వైపు తాను వెళ్లామని,  ఈ క్రమంలో నిందితులు తనను బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లినట్లుగా చెప్పకొచ్చింది. తన ఫోన్‌ను లాక్కొని తన స్నేహితుడికి కాల్ చేయాలని బెదిరించారని.. అతడు రాకపోవడంతో తనపై దారుణానికి పాల్పడ్డారని వెల్లడించింది. 

ఇది కూడా చూడండి: Gold Rates: దీపావళి వేళ మహిళలకు బిగ్ షాక్.. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు

వారినుంచి తప్పించుకోవడానికి తాను ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తుండగా అరిస్తే మరికొంతమందిని పిలుస్తామని నిందితులు తనను బెదిరించారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన ఐదుగురు నిందితులను, బాధితురాలి స్నేహితుడిని సంఘటన స్థలానికి తీసుకెళ్లి క్రైమ్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. బాధితురాలికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్లు అధికారులు తెలిపారు. 

Also Read: Baahubali The Epic: ఎవరి వల్ల కానిది 'బాహుబలి: ది ఎపిక్' రీరిలీజ్ తో జరుగుతోంది.. ఏంటో తెలిస్తే..!

Advertisment
తాజా కథనాలు