OPERATION SINDOOR : ప్రతీకారం తీర్చుకున్న పహల్గాం బాధితుల నుదుటి 'సింధూరం'

పాక్ ఉగ్రదాడి నేపథ్యంలో 'ఆపరేషన్ సిందూర్'తో ప్రతీకారం తీర్చుకోవడం ద్వారా, భారతదేశం తన పౌరుల గౌరవాన్ని, ముఖ్యంగా తమ భాగస్వాముల ప్రాణాలకు శాంతి కలగాలని కోరుకున్న మహిళల గౌరవాన్ని రెట్టింపు చేసిందని చెప్పాలి.

New Update

OPERATION SINDOOR : పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌ మే 7న 'ఆపరేషన్ సిందూర్'లో భాగంగా పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం దాడి చేసింది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో భారతదేశం ఈ ప్రతిదాడి చేసింది.

కాగా ఈ  ఆఫరేషన్‌ కు 'ఆపరేషన్ సిందూర్' అనే పేరు పెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది . ఒక్క మాటలో చెప్పాలంటే, ఏప్రిల్ 22, 2025న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల నూదుటి సింధూరాన్ని ఇది గుర్తు చేస్తుంది.  హిందూ మహిళలు నుదుట సింధూరం ధరిస్తారు. వివాహిత మహిళలు తల మీదా జుట్టు విడదీసే మధ్యలోనూ ఉపయోగించేది సింధూరం. -పహల్గాం దాడిలో భర్తలను పోగొట్టుకున్న మహిళలు తమ నుదిటి సింధూరాన్ని కూడా కొల్పోయారు. అందుకే వారు వ్యక్తిగత దుఃఖంలో కాకుండా, సామూహిక ఆగ్రహంతో తమ నుదుటి సింధూరాన్ని తుడిచిపెట్టిన వారిపై తీర్చుకున్న ప్రతీకారంగా చెప్పుకోవచ్చు. భర్తలను పోగొట్టుకున్న వారి శోకానికి ఈ ఆఫరేషన్‌  కొంత ఉపశమనం అనుకోవచ్చు.'ఆపరేషన్ సిందూర్'తో ప్రతీకారం తీర్చుకోవడం ద్వారా, భారతదేశం తన పౌరుల గౌరవాన్ని, ముఖ్యంగా తమ భాగస్వాముల ప్రాణాలకు శాంతి కలగాలని కోరుకున్న మహిళల గౌరవాన్ని రెట్టింపు చేసిందని చెప్పాలి.

ఉగ్రవాద దాడిలో భర్తలను కోల్పోయిన కొంతమంది మహిళలు గురించి చెప్పుకుంటే...

హిమాన్షి 


వినయ్‌ నర్వాల్ హర్యానాకు చెందిన 26 ఏళ్ల భారత నావికాదళ అధికారి. హిమాన్సి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య . ఆయన హనీమూన్‌లో ఉండగా పహల్గామ్‌లో మరణించారు. ఈ జంట ఉగ్రదాడికి వారం రోజుల ముందే వివాహం చేసుకున్నారు.(ఏప్రిల్ 16, 2025). తన భర్తను కోల్పోయిన తర్వాత ఆమె చేసిన మొదటి బహిరంగ వ్యాఖ్యలలో, హిమాన్షి శాంతి కోసం విజ్ఞప్తి చేస్తూ  "ఎవరిపైనా ద్వేషం ఉండకూడదు." అంటూ ప్రజలను ఇలా కోరారు.


ఐశాన్య ద్వివేది


పహల్గామ్ దాడిలో మరణించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన పర్యాటకుడు శుభం ద్వివేది భార్య ఐశాన్య ద్వివేది. ఈ జంట రెండు నెలల క్రితమే వివాహం చేసుకున్నారు.

శీతల్ కలథియా

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన బ్యాంకర్ శైలేష్ కలథియా భార్య శీతల్, తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి కుటుంబంతో సెలవులకు వెళ్లిన సమయంలో మరణించారు. ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు శీతల్ తన భర్త ,వారి ఇద్దరు పిల్లలు తో కలిసి గడ్డి మైదానంలో సరదాగా గడుపుతున్నారు.

సోహిని అధికారి

పహల్గామ్ దాడిలో మరణించిన కోల్‌కతాకు చెందిన ఐటీ ప్రొఫెషనల్ బితాన్ అధికారి భార్య సోహిని . బితాన్ అమెరికాలో పనిచేస్తూ సెలవుల కోసం భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఈ జంట తమ మూడున్నర సంవత్సరాల కుమారుడు హృదాన్‌తో కలిసి కాశ్మీర్‌కు వెళ్లారు. ఏప్రిల్ 22న, వారు అందమైన పచ్చిక బయళ్లను ఆస్వాదిస్తున్నప్పుడు, బితాన్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు.

కాజల్బెన్ పర్మార్

కాజల్‌బెన్ భర్త యతీష్‌భాయ్ పర్మార్ గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో ఒక సెలూన్ నడిపేవాడు. అతను తన కుటుంబంతో కలిసి కాశ్మీర్‌కు వచ్చాడు. వారు మొదట శ్రీనగర్‌లో ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపు రామ కథకు హాజరయ్యారు, తరువాత పహల్గామ్‌కు వెళ్లారు, అక్కడ వారి ప్రయాణం విషాదకరంగా ముగిసింది.

ప్రగతి జగదాలే

ప్రగతి జగ్దాలే ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఊచకోతలో మరణించిన మహారాష్ట్రకు చెందిన సంతోష్ జగ్దాలే భార్య . జగ్దాలే దంపతులు పూణేకు చెందినవారు. ప్రగతికి ఒక చిన్న కుమార్తె అసావరి ఉంది, ఆమె ఇప్పుడు తండ్రి లేకుండా ఒంటరి జీవితాన్ని గడపాల్సి వస్తోంది.

షీలా రామచంద్రన్


కొచ్చికి చెందిన షీలా రామచంద్రన్ తన భర్త ఎన్ రామచంద్రన్ ను పహల్గామ్‌లో కోల్పోయారు. ఆయన కుమార్తె,మనవళ్ల ముందే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అనారోగ్య కారణాల వల్ల షీలా వారితో కలిసి కశ్మీర్‌కు వెళ్లలేదు.


జెన్నిఫర్ నథానియల్

54 ఏళ్ల జెన్నిఫర్ నథానియల్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 58 ఏళ్ల LIC బ్రాంచ్ మేనేజర్ సుశీల్ నథానియల్ భార్య. నథానియల్ కుటుంబం - జెన్నిఫర్, సుశీల్, వారి 30 ఏళ్ల కుమార్తె ఆకాంక్ష, 21 ఏళ్ల కుమారుడు ఆస్టిన్ - జెన్నిఫర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి కాశ్మీర్‌కు ప్రైవేట్ ట్రిప్‌లో ఉన్నారు. ఉగ్రవాదులు వారిని ఎదుర్కొన్నప్పుడు, సుశీల్ తన భార్యను దాక్కోవాలని కోరాడు. ముష్కరులను ఒంటరిగా ఎదుర్కొన్నాడు.

జయ మిశ్రా

జయ మిశ్రా భార్య మనీష్ రంజన్ మిశ్రా, 42 ఏళ్ల ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి. ఆయన తన కుటుంబాన్ని సెలవుల కోసం కాశ్మీర్‌కు తీసుకెళ్లారు. కానీ పహల్గామ్‌లో తన భార్య ,పిల్లల ముందే ఉగ్రవాదులు ఆయనను కాల్చి చంపారు.
ఇలా తమ భర్తలను కోల్పోయిన భార్యలు ఒక రకంగా తమ భర్తల ఆత్మశాంతి కోసం మే 7న భారత సాయుధ దళాల రూపంలో ప్రతీకారం తీర్చుకున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు