Chennai: తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఫెంగల్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను తీరం దాటి 2 రోజులు దాటినా.. దాని ప్రభావంతో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడులోని తిరువణ్ణామలైలో విషాదకరమైన ఘటన జరిగింది.కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం తమిళనాడులో తీవ్ర విషాదాన్ని నింపింది.
Also Read: PV Sindhu: పెళ్ళి చేసుకోబోతున్న స్టార్ బ్యాడ్మింట్ ప్లేయర్ పి.వి.సింధు
తిరువణ్ణామలై కొండపై నుంచి వీఓసీ నగర్‌లోని ఇళ్లపై కొండ చరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి ఇంటిపై పెద్ద బండరాయి పడటంతో ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది.ఫెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడులోని చాలా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
Also Read: Actress: బీచ్‌లో యోగా చేస్తుండగా..హీరోయిన్ ని లాక్కెళ్లిన రాకాసి అల!
భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు తమిళనాడులో 21 మంది చనిపోయారు. ఇక కృష్ణగిరి జిల్లాలో బస్సులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. విజుపురం, కడలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.
Also Read: లఖ్‌నవూతో పంత్ 12 ఏళ్ల అగ్రిమెంట్.. సంజీవ్ గొయెంకా కామెంట్స్ వైరల్
తిరువణ్ణామలై జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు.. అన్నామలయార్ కొండచరియలు విరిగి స్థానికంగా ఉన్న మూడు ఇళ్లపై పడిపోయాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోయారు. ఇక కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో భారీ ప్రమాదం తప్పింది.
Also Read: OTT: థియేటర్స్ లో 'పుష్ప2'..ఓటీటీ లో 23 సినిమాలు, మూవీ లవర్స్ కి పండగే
కృష్ణగిరి జిల్లాలో గత 24 గంటల్లోనే 50 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఊతంకర బస్టాండ్‌లో ఉన్న బస్సులు కొట్టుకుపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.