Sabarimala: కేరళలలో ప్రసిద్ద శబరిమల ఆలయం మండల మకరవిళక్కు పూజల కోసం ఓపెన్ అయ్యింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులు తెరవాల్సి ఉండగా.. భారీగా అయ్యప్ప భక్తులు తరలిరావడంతో ఒక గంట ముందే అంటే సాయంత్రం 4 గంటలకే ఆలయాన్ని తెరిచినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు అధికారులు తెలిపారు. ఇక ఈ ఏడాది నిత్యం 80 వేల మందికి దర్శనాలు కల్పించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Also Read: UP: మెడికల్ కాలేజ్‌లో అగ్ని ప్రమాదం..10 మంది చిన్నారులు సజీవదహనం
ప్రత్యేక కౌంటర్లలో...
అయితే ఇందులో 70 వేల మందికి ఆన్‌లైన్‌లో వర్చువల్ క్యూ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా.. మరో 10 వేల మందికి శబరిమలలోనే 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో టికెట్లు ఇవ్వనున్నారు. ఇక మండల మకరవిళక్కు సీజన్‌లో భాగంగా శబరిమల ఆలయం తెరుచుకోవడంతో మొదటిరోజే భక్తులు భారీగా వచ్చారు.
Also Read: Cricket: ఇలా ఆడేశారేంట్రా..సౌతాఫ్రికాపై శాంసన్, తిలక్ ఊచకోత
తొలిరోజే వర్చువల్ బుకింగ్ ద్వారా దాదాపు 30 వేల మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ఈ సీజన్‌లో అయ్యప్ప దర్శన వేళలను కూడా పొడిగించినట్లు తెలిపారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ గర్భగుడిని ప్రధాన అర్చకుడు అరుణ్ కుమార్ నంబూథిరి తెరవనున్నట్లు అధికారులు వివరించారు.
Also Read: Railways: రీల్స్ చేస్తే జైలుకే..రైల్వే బోర్డు సీరియస్ డెసిషన్
శనివారం నుంచి మండల పూజలకు సంబంధించి సీజన్ అధికారికంగా మొదలు కానుంది. ఈ మండల పూజలు డిసెంబర్ 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆ తర్వాత కొద్దిరోజుల విరామం తర్వాత.. డిసెంబర్ 30వ తేదీ నుంచి మొదలయ్యే మకరవిళక్కు పూజలు.. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఈసారి దర్శన సమయం పొడిగించిన ట్రావెన్‍కోర్ దేవస్వమ్ బోర్డు అధికారులు.. రోజూ 18 గంటల పాటు దర్శనాలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అయ్యప్ప దర్శనాలు కొనసాగనున్నట్లు వివరించారు.
Also Read: Cricket: మళ్ళీ తండ్రయిన రోహిత్ శర్మ
ఇక అయ్యప్ప భక్తులకు భారత వాతావరణ శాఖ ఒక గుడ్‌న్యూస్ చెప్పింది. శబరిమలలో వాతావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఒక ప్రకటనను విడుదల చేసింది. అమర్‌నాథ్, చార్‌ధామ్ యాత్రల్లో లాగే శబరిమలలోనూ వాతావరణ వ్యవస్థను తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. శబరిమలలోని సన్నిధానం, పంబా, నీళక్కల్ ప్రాంతాల్లో 3 చోట్ల వర్ష సూచికలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.