/rtv/media/media_files/2024/11/16/MHlHhP6QhbWxnfnuiKG2.jpg)
Team India Captain Rohith Sarma:
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇల్లు ఆనందంతో నిండిపోయింది. దీనికి కారణం రోహిత్ శర్మ, రితికా దంపతులు మరోసారి తల్లిదండ్రులు అవడమే. వీరికి ఇప్పటికే సమైరా అనే కుమార్తె ఉంది. రితికా, రోహిత్ లది ప్రేమ వివాహం. ఇరుకుటుంబాల పెద్దల ఆశీర్వాదంతో 2015, డిసెంబర్ 13న వీరి వివాహం జరిగింది. ఈ అందాల జంటకు 2018 డిసెంబరు 30న సమైరా జన్మించింది.
ఇక బాబు పుట్టడంతో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ ఆస్ట్రేలియాతో జరిగే మొదటి టెస్ట్‌కు హాజరవ్వరని తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో (AUS vs IND) ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే అక్కడికి చేరుకుంది. కానీ, రోహిత్ శర్మ మాత్రం భారత్‌లోనే ఉండిపోయాడు. రెండవ టెస్ట్ సమయానికి అక్కడ చేరుకుంటారని చెబుతున్నారు.
Also Read: Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి