Karnataka : కర్ణాటకలో రూ.400 కోట్ల దారి దోపిడీ...అదంతా ఉత్తిదే..కేసు కొట్టేసిన కోర్టు

మహారాష్ట్ర మునిసిపల్‌ ఎన్నికల సమయంలో  ఓ ట్రక్కులో తరలిస్టున్న రూ.400 కోట్ల హవాలా సొమ్ము దోపిడికి గురైంది. ఈ కేసు అప్పట్లో  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ వాహన డ్రైవర్‌ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా అదంతా కట్టుకథ అని తేల్చారు.

New Update
FotoJet (9)

Rs.400 crore road robbery in Karnataka

Karnataka : మహారాష్ట్ర మునిసిపల్‌ ఎన్నికల సమయంలో  ఓ ట్రక్కులో తరలిస్టున్న రూ.400 కోట్ల హవాలా సొమ్ము దోపిడికి గురైంది. ఈ కేసు అప్పట్లో  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ వాహన డ్రైవర్‌ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా అదంతా కట్టుకథ అని తేల్చారు. దోపిడీ అంతా  బోగస్‌ అని నిర్ధారించారు. పోలీసులు, న్యాయస్థానం తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన సందీప్‌ పాటిల్‌ అనే ఓ ట్రక్కు డ్రైవర్‌ గతేడాది అక్టోబరు 22న  తన ట్రక్కులో రూ. రూ.400 కోట్ల హవాలా సొమ్ము తరలిస్తుండగా బెళగావి జిల్లాలోని చోర్లా ఘాట్‌ ప్రాంతంలో  ఏడుగురు వ్యక్తులు తనను అడ్డగించి, దాడి చేసి రూ.400 కోట్ల విలువైన రూ.2000 నోట్లతో (ప్రస్తుతం రద్దయ్యాయి) పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.  అయితే అక్టోబర్‌ లో దోపిడీ జరిగినట్లు చెప్పిన సందీప్‌ పాటిల్‌ గతేడాది డిసెంబరు 17న మహారాష్ట్రలోని నాసిక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాక దారి దోపిడీ గురించి సోషల్‌ మీడియాలో వీడియోలను అప్‌లోడ్‌ చేయడం కలకం రేపింది. ఈ వార్త కర్ణాటకలో రాజకీయంగా తీవ్ర దుమారం సృష్టించింది.

కర్ణాటక నుంచి మహారాష్ట్రకు హవాలా సొమ్ము తరలిస్తుండగా ఈ ఘటన జరిగిందని ఆయన ఫిర్యాదు చేశాడు.  ‘అతని ఫిర్యాదు మేరకు ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసి విచారించాం. సందీప్‌ పాటిల్‌ ఆరోపణలు, ట్రక్కు రూట్, టైమింగ్స్, కాల్‌ రికార్డులు అన్నీ కట్టుకథలేనని తేలాయి’ అని పోలీసు అధికారులు వివరించారు. అసలు దోపిడీ కట్టుకథ ఎందుకు అల్లాడనే దానిపై డ్రైవరును పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘బెళగావి జిల్లాలో రూ.400 కోట్ల నగదు దోపిడీ’ కేసును కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో అరెస్టయిన ఏడుగురినీ న్యాయస్థానం ఇప్పటికే విడుదల చేసింది. ఈ విషయమై న్యాయమూర్తి మాట్లాడుతూ ఈ కేసులో సరైన ఆధారాలు లేవని, నేరాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని మహారాష్ట్రలోని ఇగాత్పురి కోర్టు తీర్పునిచ్చింది. అరెస్టు అయిన ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసు దర్యాప్తునకు ఏర్పాటైన సిట్‌.. ఫిర్యాదుకు, దర్యాప్తులో తేలిన అంశాలకు పొంతనలేదని కోర్టు  తేల్చింది. దోపిడీపై మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన సందీప్‌ పాటిల్‌ చేసిన ఫిర్యాదే పూర్తిగా అబద్ధమని పేర్కొంది. అయితే, అతనిపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.

Advertisment
తాజా కథనాలు