Accident: ఘోర రోడ్డు ప్రమాదం..స్పాట్‌ లో 9 మంది మృతి!

మధ్య ప్రదేశ్‌ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ప్రయాగ్‌రాజ్ నుంచి నాగ్‌పూర్‌కు ఓ పర్యాటక బస్సు ప్రయాణికులతో వెళ్తోంది. ఈ క్రమంలోనే బస్సు నదన్ దేహత్‌ దగ్గరకు రాగానే ఆగి ఉన్న ట్రక్కును అతి వేగంతో ఢీకొట్టింది.

New Update
Road Accident rangareddy

Madhya Pradesh: మధ్య ప్రదేశ్‌ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఈ దారుణ ఘటన  మైహర్‌ జిల్లాలో శనివారం రాత్రి జరిగింది. 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రయాగ్‌రాజ్ నుంచి నాగ్‌పూర్‌కు ఓ పర్యాటక బస్సు ప్రయాణికులతో వెళ్తోంది. ఈ క్రమంలోనే బస్సు నదన్ దేహత్‌ దగ్గరకు  రాగానే ఆగి ఉన్న ట్రక్కును అతి వేగంతో ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో మొత్తం స్పాట్ లోనే 9 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో సుమారు 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

 గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించామని, వారిలో మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని మైహర్ పోలీసు సూపరింటెండెంట్‌ సుధీర్ అగర్వాల్ తెలిపారు.ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Also Read: ఏపీకి తిరిగి వస్తున్న లులూ మాల్‌...ఎక్కడేక్కడంటే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు