వరదలతో చెన్నై అతలాకుతలం.. మునిగిపోయిన వేలాది ఇళ్లు

అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో తమిళనాట భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు రాజధాని చెన్నైలోని వేలచేరిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వేలాది ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. మరింత పూర్తి సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.

New Update

కాలం కాని కాలంలో, వానాకాలం వెళ్లిపోయిన తర్వాత భారీగా వర్షాలు కురిసే ప్రాంతం తమిళనాడు. ప్రతీఏడాది అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు తమిళనాటపై వరుణుడు పగబట్టినట్టే కనిపిస్తాడు. ఏకధాటిగా దంచికొడతాడు. ముఖ్యంగా చెన్నై మహా నగరాన్ని ముంచెతుత్తాడు. ప్రతీసారి ఈ మూడు నెలల్లో చెన్నై వాసులు బోట్లపై ప్రయాణించేందుకు మానసికంగా సిద్ధమైపోతారు. అటు ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బోట్లను అందుబాటులోకి తెస్తుంది. ఈసారి కూడా అదే చేసింది. చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే 300 ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలపై వాన దేవుడు దండయాత్ర చేస్తున్నాడు.

Also Read: కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్!

11 సబ్‌వేలు మూసివేత

బంగాళఖాతంలో ఉపరితల ద్రోణి, అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో తమిళనాట భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు రాజధాని చెన్నైలోని వేలచేరిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వేలాది ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. అయితే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఇప్పటివరకు అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో చెన్నైలో ఇప్పటికే 11 సబ్ వేలు మూసివేశారు. అటు సహాయ చర్యలు అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే 16 వేల మంది వాలంటీర్లను సిద్ధం చేసింది.  చెన్నైలో 980 పునరావస కేంద్రాలు ఏర్పాటు చేసింది.

Also Read: కొత్తగా పెళ్లయిందా? ఈ మూడు పాటిస్తే మీ భార్య మిమల్ని ఎప్పటికీ వదలదు!

తమిళనాడుపై ఎక్కువ ఇంపాక్ట్‌

తమిళనాడు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఎక్కువ వర్షపాతం నమోదవడానికి ప్రధాన కారణం నార్త్ వెస్ట్ మాన్సున్. ఈ రుతువులో బంగాళాఖాతం నుంచి తేమతో కూడిన గాలులు వస్తాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు, ఈ గాలులు దక్షిణ భారతదేశంపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. అందులో తమిళనాడుపై దీని ఇంపాక్ట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ మూడు నెలల్లో బంగాళాఖాతంలో ఎక్కువగా సైక్లోన్లు ఏర్పడతాయి. తమిళనాడు తీర ప్రాంతాలు బంగాళాఖాతానికి చాలా దగ్గరగా ఉంటాయి. 

నిజానికి నైరుతి రుతుపవనాలు ప్రధానంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు భారత్‌లోని పశ్చిమ, ఉత్తర ప్రాంతాలకు వర్షపాతం తెస్తాయి.
ఆ తర్వాత తిరోగమన రుతుపవనాలు అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు తమిళనాడు రాష్ట్రానికి వర్షాన్ని తెప్పిస్తాయి. బంగాళాఖాతం మీదుగా ఈశాన్యం నుంచి నైరుతి దిశగా ప్రయాణించే ఈ రుతుపవనాలు తమిళనాడులో వర్షాలు కురిపిస్తాయి. అటు భౌగోళికంగా తమిళనాడు ఉన్న స్తానం స్థానం కారణంగా అక్కడి తీరంలో శీతాకాలపు వర్షాలు కురుస్తాయి.

Also Read: రైతులకు మోదీ సర్కార్ అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు!

200 మందికిపైగా మృతి

ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో చెన్నై వరదలకు గురయ్యే అవకాశం చాలా ఎక్కువ.  అక్టోబర్ నుంచి డిసెంబర్‌ వరకు కురిసే వర్షాలు తమిళనాడు వార్షిక వర్షపాతంలో 40 శాతానికి పైగా ఉంటుంది. ఇలా మూడు నెలల పాటు కురిసే భారీ వర్షాలకు వరదలు సంభవిస్తాయి. కొన్నిసార్లు ప్రాణనష్టం కూడా జరుగుతుంది. 2015 డిసెంబర్‌లో సంభవించిన చెన్నై వరదలకు 200 మందికిపైగా చనిపోయారు. అక్కడ రిజర్వాయర్ నిర్వహణ లోపమే ఇలాంటి వరదలకు ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతుంటారు.

Also Read: ఖగోళ అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు రాదు!

2021 నాటి క్లైమేట్ చేంజ్ వల్నరబిలిటీ ఇండెక్స్ ప్రకారం భారతీయ నగరాల్లో వాతావరణ మార్పులకు అత్యధికంగా గురయ్యే నగరంగా చెన్నై నిలిచింది. భారీ వర్షపాతం, డ్రైనేజీలు సరిగా లేకపోవడం చెరువులు, నదీ మార్గాలు కబ్జాకు గురికావడం తమిళనాడులో సమస్య తీవ్రతను మరింత పెంచుతోంది. ఇదిలా ఉంటే వాతావరణ పరిణామాల్లో మార్పు, కాలుష్యం పెరగడం వల్ల మంచు ఫలకలు కరిగిపోవడం మొదలైంది. ఇది ఇలాగే కొనసాగితే సముద్ర నీటిమట్టాలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలు, పట్టణాలు తడిచిపెట్టుకుపోవడం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

 

#telugu-news #chennai #floods
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe