DRDO మరో ఘనత... ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ పరీక్ష విజయవంతం

DRDO దేశీయంగా అభివృద్ధి చేసిన 'ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్' టెస్ట్ ఒడిషా తీరం నుంచి విజయవంతంగా నిర్వహించింది. ఆగస్టు 23, 2025న మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఈ పరీక్షలు జరిగినట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన X అకౌంట్‌లో తెలిపారు.

New Update
DRDO

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) దేశీయంగా అభివృద్ధి చేసిన 'ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్' టెస్ట్ ఒడిషా తీరం నుంచి విజయవంతంగా నిర్వహించింది. ఆగస్టు 23, 2025న మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఈ పరీక్షలు జరిగినట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన X అకౌంట్‌లో తెలిపారు. ఈ విజయానికి డిఆర్‌డిఓ, భారత సైనిక దళాలు, దేశీయ పరిశ్రమ పాట్నర్‌షిప్‌‌ని ఆయన అభినందించారు.

ఈ IADWS ఒక అధునాతన, మల్టీ లెవల్ డిఫెన్స్ వ్యవస్థ. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో మూడు కీలకమైన స్వదేశీ సాంకేతికతలు ఒకే చోట ఉన్నాయి. 
అవి: 
క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ (QRSAM), 
అడ్వాన్స్‌డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS) క్షిపణులు 
ఒక హై-పవర్ లేజర్-ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (DEW) 

ఈ మూడు వ్యవస్థల కలయికలతో శత్రువుల గగనతల దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఉదాహరణకు, QRSAM క్షిపణులు శత్రు విమానాలు లేదా క్షిపణులను సుదూర ప్రాంతం నుంచి అడ్డుకుంటాయి. VSHORADS క్షిపణులు తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్‌లు, హెలికాప్టర్లు, ఇతర గగనతల లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి. ఇక, లేజర్-ఆధారిత DEW వ్యవస్థ క్లిష్టమైన లక్ష్యాలను అత్యంత వేగంగా, కచ్చితత్వంతో అటాక్ చేస్తోంది.

ఈ విజయవంతమైన పరీక్షలు భారతదేశ రక్షణ రంగానికి ఒక మైలురాయిగా చెప్పవచ్చు. ఇది మన దేశం తన రక్షణ అవసరాల కోసం స్వయం-సమృద్ధి సాధించడంలో ఒక ముఖ్యమైన ముందడుగు. అలాగే, శత్రు గగనతల దాడుల నుండి ముఖ్యమైన కేంద్రాలు, నగరాలు, సైనిక స్థావరాలను రక్షించడంలో ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థ అభివృద్ధి దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని రక్షణ నిపుణులు పేర్కొన్నారు. క్లిష్టమైన డిఫెన్స్ టెక్నాలజీలను దేశీయంగా తయారు చేయగల మన సత్తాను ఈ పరీక్ష నిరూపించింది.

Advertisment
తాజా కథనాలు