Ratan Tata : నువ్వు దేవుడయ్యా సామీ.. వంటమనిషికి రూ.కోటి!

దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా వీలునామా గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనకు ఎప్పటి నుంచో వండిపెడుతున్న కుక్ రజన్ షాకు ఆయన రూ. కోటి ఇచ్చారు. ఇంటి పనులు చేసే సుబ్బయ్యకు రూ.66 లక్షలు, సెక్రటరీ డెల్నాజుకు రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు.

New Update
ratan-tata cook

ratan-tata cook

దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా వీలునామా గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనకు ఎప్పటి నుంచో వంట వండిపెడుతున్న కుక్ రజన్ షాకు ఆయన రూ. కోటి ఇచ్చారు. అందులో రూ. 51 లక్షల రుణ మాఫీ కూడా ఉంది. ఇంటి పనులు చేసే సుబ్బయ్యకు రూ.66 లక్షలు, సెక్రటరీ డెల్నాజుకు రూ.18 లక్షలు రుణం మాఫీ చేశారు. తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకు ఎంబీఏ కోసం పొడిగించిన రూ.కోటి రుణాన్ని రతన్ టాటా మాఫీ చేశారు. పార్ట్ టైమ్ హెల్పర్లు, కార్ క్లీనర్లకు రూ.  లక్ష పంపిణీ చేయాలని కూడా ఆయన వీలునామాలో నిర్దేశిస్తున్నారు.  

రతన్ టాటా తన దుస్తులను NGOలకు విరాళంగా ఇవ్వాలని  టాటా 2022 ఫిబ్రవరి 23 నాటి తన వీలునామాలో పేర్కొన్నారు. తద్వారా వాటిని పేదలకు పంపిణీ చేయవచ్చు. బ్రూక్స్ బ్రదర్ షర్టులు, హెర్మ్స్ టైలు, పోలో, డాక్స్, బ్రియోని సూట్లు వంటి బ్రాండ్లను  రతన్ టాటా ధరించేవారు. రతన్ టాటా పెంపుడు జంతువు టిటో గురించి వీలునామాలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.  జర్మన్ షెపర్డ్ కోసం ఆయన రూ. 12 లక్షలు కేటాయించారు.   ప్రతి త్రైమాసికానికి రూ.30వేల చొప్పున వాటికి ఖర్చే చేసేలా నిధులను ఇవ్వాలని తన వీలునామాలో రాశారు. 

బాంబే హైకోర్టులో పిటిషన్లు

అటు తన సవతి సోదరీమణులు అయిన శిరీన్‌ జజీభోయ్‌, దియానా జజీభోయ్‌ పేరు మీద రూ.800 కోట్లు రాశారు రతన్ టాటా. ఇందులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, స్టాక్స్‌తో పాటు ఖరీదైన వాచ్‌లు, పెయింటింగ్స్‌ వంటి విలువైన వస్తువులున్నాయి. ఇక టాటా గ్రూప్‌ మాజీ ఉద్యోగి, రతన్‌కు అత్యంత సన్నిహితుడైన మోహిన్‌ ఎం దత్తాకు కూడా ఏకంగా రూ.800 కోట్ల విలువైన ఆస్తులు రాసిచ్చారు.  కాగా  రతన్ టాటాకు రూ.10వేల కోట్ల ఆస్తులుండగా, రూ.3800 కోట్లను దానధర్మాలకు ఇచ్చేశారు. 2022 ఫిబ్రవరి 23న రాసిన ఈ వీలునామా ప్రకారం ఆస్తుల కేటాయింపు జరగాల్సి ఉంటుంది.. ఇప్పటికే దీనిపై  బాంబే హైకోర్టులో పిటిషన్లు ధాఖలైంది.  ఇదంతా పూర్తయ్యేసరికి మరో ఆరు నెలలు పడుతుంది.  

Nagarkurnool : భార్యాభర్తలు కాదని గ్యాంగ్ రేప్.. సంచలన విషయాలు బయటపెట్టిన ఐజీ!
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు