Nagarkurnool : భార్యాభర్తలు కాదని గ్యాంగ్ రేప్.. సంచలన విషయాలు బయటపెట్టిన ఐజీ!

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండపేట గ్రామ శివారులోని ఆంజనేయస్వామి దైవదర్శనానికి వచ్చిన ఓ వివాహితపై ఏడుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో సంచలన విషయాలను ఐజీ సత్యనారాయణ బయటపెట్టారు.

New Update
gang-rape-on-women

gang-rape-on-women

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండపేట గ్రామ శివారులోని ఆంజనేయస్వామి దైవదర్శనానికి వచ్చిన ఓ వివాహితపై ఏడుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అయితే ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆలయానికి వచ్చింది భార్యభర్తలు కాదని తెలుసుకున్న దుండగులు పక్కా ప్లాన్ తో  వివాహితను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డారని మల్టీజోన్‌-2 ఐజీ సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. బాధితురాలిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన ప్రదేశాన్ని ఆయన మంగళవారం జిల్లా ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌తో కలిసి పరిశీలించారు.  

ఒంటరిగా బహిర్భూమికి వెళ్లిన సమయంలో

ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ రాత్రి పది గంటల సమయంలో ఓ జంట ఆలయానికి రావడాన్ని నలుగురు నిందితులు గమనించారని మరో ముగ్గురికి ఫోన్ చేసి పిలిపించుకున్నారు.  మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన ఆమెపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివాహిత ఒంటరిగా బహిర్భూమికి వెళ్లిన సమయంలో గ్యాంగ్‌రేప్‌ జరిగింది. మహిళ ఎంతకూ రాకపోవడంతో వెతకడానికి వెళ్లిన ఆమెతో వచ్చిన వ్యక్తిని తాళ్లతో కట్టేశారు. అనంతరం బాధితురాలు తేరుకుని, ఆమెతో వచ్చిన వ్యక్తి కట్లు విప్పింది. అనంతరం బాధితురాలు తన ఇంటికి వెళ్తుండగా..  నిందితుల్లో ఒకరైన మహేశ్‌గౌడ్ గమనించి ఈ విషయం ఎవరికైనా చెబితే  మీ వ్యవహారం బయట పెడతామని బెదిరించాడు. దీంతో బాధితురాలు తన  ఆభరణాలు, డబ్బు చోరీ చేశారంటూ ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

సీసీ కెమెరాలను పరిశీలించి

ఆలయానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు  మహేశ్‌గౌడ్‌ బాధితురాలిని బెదిరించడాన్ని కనిపించింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఊర్కొండపేటకు చెందిన సాధిక్‌బాబా, హరీశ్‌గౌడ్, మణికంఠగౌడ్, మారుపాకుల ఆంజనేయులుగౌడ్, మట్ట ఆంజనేయులుగౌడ్, కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామానికి చెందిన కార్తిక్‌ బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు.  

Also Read : German woman: జర్మనీ యువతి రేప్ కేసు.. పోలీసులకు దొరికిన నిందితుడు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు