రతన్ టాటా అంటే ఎవరికీ పరిచయం అక్కర్లేని పేరు. దేశ ఆర్థిక వ్యవస్థను శాసించారు సూరుడు. దేశమే ప్రథమం అని నమ్మిన రతన్ టాటా.. పారిశ్రామిక రంగంలో దేశాన్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లారు. అయితే, ఆటోమొబైల్ రంగంలో రతన్ టాటా తీసుకొచ్చిన నానో కారు ఓ సంచలనం. సామాన్యులు కూడా కారులో తిరగాలనే ఆలోచనతో.. అతి తక్కువ ధరకు అందుబాటులో తీసుకొచ్చారు.
పేదల కోసమే నానో కార్..
ఈ నానో కారును ఎందుకు తీసుకొచ్చారనే ప్రశ్న వస్తే.. నానో కారును తీసుకొచ్చేందుకు తనను ఓ సంఘటన కలిచివేసిందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతూ, ఇరుకిరుకుగా బైక్‌లపై వెళ్లడం చూసి గుండె తరుక్కుపోయిందన్నాడు. అప్పుడే వీళ్లు కూడా కారులో ప్రయాణించాలంటే నేను ఏమైనా చేయగలనా అనీ.. అప్పుడే, సామాన్యులకు అందుబాటులో నానో కారు తీసుకొచ్చారు.
Also Read : కవిత బతుకమ్మ సంబరాలు.. వీడియో వైరల్!