/rtv/media/media_files/q680LTxosonQD1BvHhO0.jpg)
Kavitha Bathukamma: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను మరింత ఘనంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాల్లో సందడి చేసేవారు. జాగృతి పేరిట ఈ పూల పండుగను విశ్వవ్యాప్తం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకెళ్లి ఇటీవలే బెయిల్ పై విడుదలైన కవిత.. ఈ యేడాది బతుకమ్మ సంబరాల్లో ఎక్కడా కనిపించట్లేదు. దసరాకు ముందే ఆమెకు బెయిల్ రావడంతో పండుగ వేడుకల్లో కవిత పాల్గొంటారని అంతా భావించారు. కానీ కవిత మాత్రం ఉలుకుపలుకు లేకుండా మౌనంగా ఉంటున్నారు. కనీసం ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు కూడా చెప్పకపోవడం చర్చనీయాంశమైంది. ఆమె ఎందుకు ఇలా ఉంటున్నారనే విషయంలో ఆసక్తి నెలకొంది.
Bathukamma with my lovely sisters at Metpalli #Bathukammapic.twitter.com/qjrOl51Muv
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 27, 2022
ఇదిలా ఉంటే.. ప్రతి యేడాది తెలంగాణ భవన్ తో పాటు గవర్నమెంట్ ఆఫీసులు, అధికారిక బతుకమ్మ వేడుకల్లో కవిత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేవారు. అమ్మలక్కలతో కలిసి ఆడిపాడేవారు. స్వయంగా బతుకమ్మ పాటలు పాడి అలరించేవారు. డ్యాన్స్ చేసి సందడి చేసేవారు. తెలంగాణ బతుకమ్మ అంటే కవిత.. కవిత అంటే బతుకమ్మ అనే రేంజ్ లో బీఆర్ఎస్ శ్రేణులు గొప్పగా చెప్పుకునేవారు. అలాంటి కవిత ఇప్పుడు మూగబోవడంపై ఆమె అభిమానులు, సన్నిహితులు నిరాశకు లోనవుతున్నారు.
తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు💐🥰#Bathukamma@RaoKavithapic.twitter.com/prXjt1Q2zW
— Pavani Goud BRS (@PAVANIGOUD_BRS) October 10, 2024
ఈ బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొంటారని భావించిన వారంతా డిజప్పాయింట్ అవుతున్నారు. ఆమె కనీసం బతుకమ్మ శుభాకాంక్షలు కూడా చెప్పకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. ఇంట్లో బతుకమ్మ వేడుకలకు సంబంధించి కనీసం ఒక్కపోస్ట్ కూడా కవిత పోస్ట్ చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుతో బతుకమ్మ పండుగ ముగియనుండగా సాయంత్రంలోపైన కవిత కనిపిస్తుందా లేదా అనే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
నీ ఆట, నీ పాట లేకపోతె బతుకమ్మ పండుగ కూడా మూగబోయింది....🥺
— Rithika Telangana (@Rithika_tweetz) October 7, 2024
సద్దుల బతుకమ్మ నాడు మీరు వచ్చి ఈ వెలతిని నింపాలని అని మనస్పూర్తిగా కోరుకుంటున్న అక్క....🫶🙏@RaoKavithapic.twitter.com/S2RM6ZBgGq
తెలంగాణ ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు...#saddulabathukamma#bathukamma2024#kavithabathukammapic.twitter.com/ui5ya93yAi
— Rajeev Sagar Meday (@RajeevSagarM) October 10, 2024