Rat in Indigo Flight: ఇండిగో విమానంలో ఎలుక హల్‌చల్.. ఎంత పని చేశావే..!

కాన్పూర్ నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో విమానం క్యాబిన్‌లో ఎలుక కనిపించడంతో మూడు గంటలకు పైగా ఆలస్యమైంది. ఆదివారం మధ్యాహ్నం 2:55 గంటలకు బయలుదేరాల్సిన విమానంలో ప్రయాణికులు, సిబ్బంది ఎక్కాక ఒక ఎలుకను గమనించారు. వెంటనే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు.

New Update
indigo flight

కాన్పూర్ నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో విమానం క్యాబిన్‌లో ఎలుక కనిపించడంతో మూడు గంటలకు పైగా ఆలస్యమైంది. ఆదివారం మధ్యాహ్నం 2:55 గంటలకు బయలుదేరాల్సిన విమానంలో ప్రయాణికులు, సిబ్బంది ఎక్కాక ఒక ఎలుకను గమనించారు. వెంటనే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. ఇది ఆదివారం జరగ్గా.. ఆలస్యంగా బయటకు వచ్చింది

విమానంలో ఎలుకలు ఉండటం భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిగణిస్తారు. ఎలుకలు విమానంలోని కీలక వైర్లను లేదా నియంత్రణ వ్యవస్థలను కొరికేసే ప్రమాదం ఉంది. అందుకే, ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఎయిర్‌లైన్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా విమానంలో ఉన్న దాదాపు 172 మంది ప్రయాణికులను కిందకు దింపి, విమానాశ్రయం లాంజ్‌కు పంపించారు.

ఆ తర్వాత, ఇండిగో సాంకేతిక బృందం, గ్రౌండ్ సిబ్బంది ఎలుక కోసం విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించిన తర్వాత ఎలుకను పట్టుకొని బయటకు పంపించగలిగారు. విమానం పూర్తిగా సురక్షితంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత, ప్రయాణికులను తిరిగి ఎక్కించారు. ఈ జాప్యం వల్ల కొంతమంది ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. అయితే, ఇండిగో అధికారులు ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపారు. చివరకు సాయంత్రం 6:04 గంటలకు విమానం ఢిల్లీకి బయలుదేరింది.

Advertisment
తాజా కథనాలు