బెయిల్‌పై బయటకు వచ్చి బాధితురాలిని చంపిన నిందితుడు

ఉత్తరప్రదేశ్‌లో 20 ఏళ్ల రింకూ అనే వ్యక్తి 17 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడి జైలుకు వెళ్లాడు. ఈ నెలలో బెయిల్‌పై విడుదలైన నిందితుడు బాధితురాలిపై తుపాకితో కాల్పులు జరిపి హత్య చేశాడు. సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

New Update
Woman

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ అత్యాచార నిందితుడు బెయిల్‌పై జైలు నుంచి విడుదలై బాధితురానికి హత్య చేయడం కలకలం రేపుతోంది. దీంతో పోలీసులు నిందితుడితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే శంభాల్‌ జిల్లాలోని ఈ ఏడాది ఫిబ్రవరిలో 20 ఏళ్ల రింకూ అనే వ్యక్తి 17 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫిర్యాదు మేరకు ఘజియాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టాక రిమాండ్ కోసం జైలుకు తరలించారు. 

Also Read: 12 పాసయితే చాలు..రైల్వేలో 3445 ఉద్యోగాలు

గత కొన్ని రోజులుగా జైల్లో ఉన్న రింకూ ఈ నెలలో బెయిల్‌పై విడుదలయ్యాడు. సెప్టెంబర్‌ 18న రాత్రికి తల్లితో కలిసి సోదరిడి బైక్‌పై వెళ్తున్న బాధిత యువతిని.. రింకు తన స్నేహితుడితో కలిసి అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై గన్‌తో కాల్పులు చేసి హత్య చేశాడు. మరోవైపు ఫిర్యాదు అందుకున్న పోలీసులు రింకూ, అతడి స్నేహితుడిని అరెస్టు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన పేర్కొన్నారు.

       

Advertisment
Advertisment
తాజా కథనాలు