రతన్ టాటాతో గడిపిన క్షణాలు గుర్తుచేసుకున్న పీవీ సింధూ, బిల్‌గేట్స్ భారత దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణంతో ఆయనకు సోషల్ మీడియాలో ప్రముఖులతో పాటు నెటిజన్లు సంతాపం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా క్రీడాకారిణి పీవీ సింధూ, వ్యాపారవేత్త బిల్‌గేట్స్ ఆయనతో కలిసిన క్షణాలను పంచుకున్నారు. By B Aravind 10 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి భారత దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణంతో ఆయనకు సోషల్ మీడియాలో ప్రముఖులతో పాటు నెటిజన్లు సంతాపం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ ఛాంపియన్ పీవీ సింధూ, అలాగే మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్‌గెట్స్ ఎక్స్‌లో రతన్ టాటాకు సంతాపం తెలిపారు. ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. Also Read: రతన్ టాటా వారసుడు ఎవరు?.. రేసులో నలుగురు ! ''రతన్ సర్, మీ వినయం, కరుణ, దయ నిజంగా సాటిలేనివి. కొన్నిసార్లు మిమ్మల్ని కలిశాను. ఆ క్షణాలు నాకు ఎప్పటికీ ప్రియమైనవే. జ్ఞానంతో నిండిన ప్రతీఒక్కటి కూడా జీవితాంతం నాతో ఉండిపోతుంది. మన సుదీర్ఘ సంభాషణలు, వ్యాపారం నుంచి జంతు సంరక్షణ వరకు, జీవితం గురించి నాకు చాలా నేర్పిన అమూల్యమైన పాఠాలు నిండి ఉన్నాయి. మీరిచ్చిన ప్రేరణ, చేసిన కృషికి ధన్యవాదాలు. మీమ్మల్ని మిస్ అవుతున్నామని'' పీవీ సింధూ పోస్ట్ చేశారు. Ratan Sir, your humility, compassion, and kindness were truly unmatched. The few times I had the privilege of meeting you are moments I will forever hold dear, each filled with wisdom that will stay with me for a lifetime. Our long conversations, from business to animal welfare,… pic.twitter.com/8mGOidCNTz — Pvsindhu (@Pvsindhu1) October 10, 2024 అలాగే బిల్‌గేట్ల్ కూడా లింక్‌డిన్‌లో రతన్ టాటా గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ''రతన్ టాటా దార్శనికత కలిగిన నాయకుడు, జీవితాలను మెరుగుపరచడంలో అతని అంకితభావం భారత్, ప్రపంచంపై చెరగని ముద్ర వేసింది. కొన్ని సందర్భాల్లో ఆయనను కలుసుకున్నాను. మానవాళికి సేవ చేయాలనే ఆయన బలమైన ఉద్దేశ్యం నన్ను కదిలించింది. ప్రజలకు ఆరోగ్యకరమైన, సంపన్నమైన జీవితాలను అందించేందుకు సాయం చేయడంలో మేము అనేక కార్యక్రమాలలో భాగస్వాములమయ్యాము. ఆయన మన నుంచి దూరమైన ప్రభావం రాబోయే సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. కానీ ఆయన వదిలిపెట్టిన వారసత్వం, అతను సెట్ చేసిన ఉదాహరణ తరతరాలకు స్ఫూర్తినిస్తుందని'' బిల్‌గేట్స్ అన్నారు. #ratan-tata #pv-sindhu #bill-gates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి