Robert Vadra: ప్రియాంక గాంధే ప్రధాని కావాలి.. రాబర్ట్‌ వాద్రా సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీలో ఎంపీల నుంచి కొత్త వాదన కాంగ్రెస్ పార్టీ వినిపిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ ఇటీవల సోషల్ మీడియాలో ప్రియాంక గాంధీనే ప్రధాని కావాలని కోరారు. అంతేకాదు. ప్రియాంక గాంధీ భర్త వాద్రా రాబర్ట్ కూడా అదే మాటను తాజాగా సమర్దించారు.

New Update
vadra rabort

కాంగ్రెస్ పార్టీలో ఓ చర్చ ఇటీవల బాగా జోరందుకుంటోంది. అదే ఆ పార్టీలో ఎవరు ప్రధాని అభ్యర్థి అని. ఇప్పటి వరకూ గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థి అని అందరూ భావించారు. అనూహ్యంగా మరో కొత్త వాదన కాంగ్రెస్ పార్టీ ఎంపీల నుంచి వినిపిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ ఇటీవల సోషల్ మీడియాలో ప్రియాంక గాంధీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మన దీ జియే ప్రధాన మంత్రి.." (ఆమెను ప్రధానిని చేయండి) అనే అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. లోక్‌సభలో ఆమె ప్రసంగాలు, ప్రజలతో ఆమె మమేకమయ్యే తీరును మెచ్చుకుంటూ ఆమెకు దేశాన్ని నడిపించే సత్తా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వాయనాడ్ ఉపఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచినప్పటి నుండి పార్టీలో ప్రియాంక ప్రాధాన్యత పెరగడం ఈ వ్యాఖ్యలకు బలాన్నిచ్చింది.

రాబర్ట్ వాద్రా రియాక్షన్

తన భార్య ప్రియాంక గాంధీ గురించి ఎంపీ చేసిన వ్యాఖ్యలపై రాబర్ట్ వాద్రా సానుకూలంగా స్పందించారు. ప్రియాంకలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, ఆమె ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడుతుందని ఆయన పేర్కొన్నారు. "ప్రజలు ఆమెను ప్రేమిస్తున్నారు. ఆమె పార్లమెంటులో ప్రజల గొంతుకను వినిపిస్తున్నారు. దేశం కోసం ఆమె చేసే ఏ నిర్ణయానికైనా కుటుంబం మద్దతు ఉంటుంది" అని వాద్రా అన్నారు. అయితే, ప్రధాని అభ్యర్థిత్వంపై నిర్ణయం పార్టీ అధిష్టానం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

బీజేపీ విమర్శలు

ఈ పరిణామాలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ప్రియాంకను ప్రధాని ముఖచిత్రంగా చూపడం అంటే, రాహుల్ గాంధీ నాయకత్వంపై కాంగ్రెస్ పార్టీలోనే నమ్మకం లేదని అర్థమని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికీ గాంధీ ఫ్యామిలీ తప్పా మరొకరికి చోటు లేదని బీజేపీ విమర్శించింది. రాహుల్ గాంధీ విఫలమయ్యారు కాబట్టే ఇప్పుడు ప్రియాంకను ముందుకు తెస్తున్నారని, ఇది వారి అసహనానికి నిదర్శనమని బీజేపీ జాతీయ ప్రతినిధులు వ్యాఖ్యానించారు.

వాయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే ప్రియాంక గాంధీ తన వాగ్ధాటితో పార్లమెంటును ఆకర్షించారు. ముఖ్యంగా వందేమాతరం, రైతు సమస్యలపై ఆమె చేసిన ప్రసంగాలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఈ క్రమంలోనే ఆమెను ప్రధాని అభ్యర్థిగా చూడాలని కొందరు నేతలు కోరుకోవడం, దానికి బీజేపీ నుంచి కౌంటర్లు రావడం దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Advertisment
తాజా కథనాలు