హర్యానాలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 20,632 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 2 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

New Update
Haryana Elections

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 90 స్థానాలకు 1,031 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 20,632 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 2 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో పోలీసు బృందాలు మోహరించాయి. పదేళ్లుగా హర్యానాను బీజేపీ పాలిస్తోంది. అయితే ఈసారి కూడా మళ్లీ గెలవాలనే పట్టుతో ఉంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో ఎలాగైన గెలిచి అధికారం సొంతం చేసుకోవాలనుకుంటోంది. 

Also read: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

బీజేపీ పదేళ్ల పాటు అధికారంలో ఉండటంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగినట్లు కనిపిస్తోంది. కుల సమీకరణలు ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. హర్యానా రాష్ట్రం చిన్నదే అయినప్పటికీ ఈ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతగా మెజార్టీ సీట్లు సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే మరోసారి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. దీంతో హర్యానాలో ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు