Maharashtra: చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచిన మేనకోడలు తనకు ఇష్టంలేని వ్యక్తిని పెళ్లిచేసుకుందని దారుణానికి ఒడిగట్టాడు ఓ మేనమామ. కోపంలో విచక్షణ కోల్పోయి విందు భోజనంలో విషం కలిపాడు. ఈ దారుణ ఘటన కొల్హాపుర్ జరిగింది. Also Read : మహారాష్ట్రలో ఘోరం.. రూ. 500 కోసం సొంత తమ్ముడి హత్య.. అసలేం జరిగిందంటే ? విందు భోజనంలో విషం ఉట్రే గ్రామంలో నివాసం ఉంటున్న మహేష్ పాటిల్ చిన్నప్పటి నుంచి తన ఇంట్లోనే మేనకోడలిని పెంచాడు. అయితే ఆ యువతి తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడం కుటుంబసభ్యులకు ఏ మాత్రం ఇష్టం లేదు. అయినప్పటికీ కుటుంబ సభ్యులు ఆ జంటను ఆశీర్వదించి.. వారి కోసం ఇంట్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. కానీ ఆ అమ్మాయి మేనమామ మాత్రం ఇంకా కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన మహేష్ రిసెప్షన్ లో అతిథుల కోసం ఏర్పాటు చేసిన విందులో విషం కలిపాడు. అదృష్టవశాత్తు ఇదంతా దూరం నుంచి గమనించిన కొందరు వ్యక్తులు.. మహేష్ ని నిలదీశారు. దీంతో మహేష్ అక్కడి నుంచి పారిపోయాడు. విషం కలపడం ముందుగానే పసిగట్టడంతో ఏ అనర్థం జరగకండా ఆపగలిగారు. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న నిందుతుడు మహేష్ కోసం గాలిస్తున్నారు. అంతేకాదు ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆహార పదార్థాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. Also Read: Tripti Dimri: వైట్ బాడీకాన్ గౌనులో త్రిప్తి అందాల విధ్వంసం..! చూస్తే ఫిదా - Rtvlive.com