Pm Modi Tweets On Congress:
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రాల బడ్జెట్‌ను పరిగణలోకి తీసుకోకుండా హామీలు ప్రకటించొద్దని సూచనలు చేశారు. మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల కాంగ్రెస్ చీఫ్‌లకు సూచించారు. రాష్ట్ర బడ్జెట్ ఆధారంగానే గ్యారంటీలు ప్రకటించాలని హెచ్చరించారు.
Also Read: Stock Market:మూరత్ ట్రేడింగ్‌లో అదరగొట్టిన సూచీలు..లాభాలతో కొత్త సంవత్
Also Read:IPL 2025:కేఎల్ రాహుల్ రిలీజ్..ఓనర్ సంజీవ్ గోయెంకా అనుచిత వ్యాఖ్యలు
దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. అబద్ధపు వాగ్ధానాలు చేయడం ఈజీనే...కానీ వాటిని అమలు చేయడమే కష్టం. ఇప్పుడు కాంగ్రెస్ దీనిని గ్రహిస్తోంది అంటూ ఎక్స్‌లో వరుస పోస్ట్ లు పెట్టారు. ఆచరణ సాధ్యం కాని హామీలని తెలిసినా.. ప్రచారంలో ఊదరగొట్టారని.. ఇప్పుడేమో ప్రజల ముందు ఘోరంగా నిలబడ్డారని పేర్కొంటూ #FakePromisesOfCongress అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఆర్ధిక పరిస్థితి దిగజారిందని చెప్పుకొచ్చారు ప్రధాని. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమంటే.. వారిని మోసగించడమేనన్నారు. ఇలాంటి రాజకీయాలతో పేదలు, యువత, రైతులు, మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను నిరాకరించడమే కాదు.. ప్రస్తుతం అమలవుతున్న పథకాలను సైతం నీరుగార్చేలా చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ బూటకపు హామీల మీద ప్రజలు అప్రమత్తంగా ఉండాలన మోదీ సూచించారు.
Also Read: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలోకి నార్త్ కొరియా బలగాలు–ధృవీకరించిన అమెరికా
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు, దోపిడీలో బిజీగా ఉందంటూ ప్రధాని మోదీ మండిపడ్డారు. అక్కడ అమల్లో ఉన్న పథకాలను కూడా వెనక్కు తీసుకొంటున్నారని ఆరోపించారు. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు ఇవ్వడం లేదని.. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన రుణమాఫీ హామీ అమలు కోసం రైతులు ఎదురుచూస్తున్నారని మోదీ పోస్ట్‌లో రాసుకొచ్చారు. కాంగ్రెస్ ఎలా పనిచేస్తుందో చెప్పేందుకు ఇవే అనేక ఉదాహరణలని అన్నారు.
Also Read: National: ఈసీకి స్వతంత్రత లేదు–కాంగ్రెస్ లేఖ