PM Modi: 'శభాష్ తెలంగాణ'.. మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ

మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ తెలంగాణను ప్రశంసించారు. నాలుగేళ్ల నుంచి మొక్కలు నాటుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కె.ఎన్ రాజశేఖర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. 'ఎక్‌ పెడ్‌ మా కే నామ్' కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగం కావాలన్నారు.

Man ki baat
New Update

ప్రతీనెల చివరి ఆదివారంలో నిర్వహించే మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ తెలంగాణపై ప్రశంసల వర్షం కురిపించారు. లక్ష్యాన్ని మించి మొక్కలు నాటినందుకు హర్షం వ్యక్తం చేశారు. ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌’ (అమ్మ పేరిట ఒక మొక్క) కార్యక్రమంలో భాగంగా రికార్డు స్థాయిలో మొక్కలు నాటారని పేర్కొంటూ అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కె.ఎన్‌ రాజశేఖర్‌ను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. '' మన దేశంలో మొదలైన మొక్కలు నాటే ఉద్యమాలకు అనేక స్పూర్తిదాయక ఉదాహణలు ఉన్నాయి. అందులో ఓ ఉదాహణ తెలంగాణకు చెందిన కె.ఎన్ రాజశేఖర్. చెట్లను నాటాలనే అతని నిబద్ధత నిజంగా గుర్తించదగినది. నాలుగేళ్ల క్రితం ప్రతిరోజూ ఓ మొక్క నాటాలనే మిషన్‌ను ఆయన ప్రారంభించారు.  

Also Read: మెరైన్‌ రఫేల్‌ డీల్.. తుది ధరలు సమర్పించిన ఫ్రాన్స్

ప్రతిఒక్కరూ భాగం కావాలి

రాజశేఖర్ 1500లకు పైగా మొక్కలు నాటి తన నిబద్ధతకు కట్టుబడి ఉన్నారు. ఈ ఏడాది అతనికి వ్యక్తిగత ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా తన పనిని కొనసాగించారు. ఈ విషయంలో రాజశేఖర్‌ కృషిని నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే 'ఎక్‌ పెడ్‌ మా కే నామ్' కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగం కావాలని ప్రోత్సహిస్తున్నానని'' ప్రధాని మోదీ అన్నారు.  

ఇదిలాఉండగా భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన రాజశేఖర్ .. సింగరేణి కంపెనీలో ఫిట్టర్‌గా పనిచేస్తున్నారు. 2020, జులై 1 నుంచి.. 'ఎక్‌ పెడ్‌ మా కే నామ్' కార్యక్రమంలో భాగంగా 'ప్రకృతి హరిత దీక్ష' పేరుతో ప్రతిరోజూ మొక్కలను నాటారు. అంతేకాదు ఈయన మొక్కలను, విత్తనాలను కూడా ఇతరులకు పంపిచేవారు. వివిధ మొక్కలకు చెందిన ఒక కోటీ విత్తనాలను పంపిణీ చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటివరకు విజయవంతంగా 10 లక్షల విత్తనాలను ఇతరులకు అందించారు. ఇటీవలే రాజశేఖర్‌ చేస్తున్న కృషికి.. ఆయన్ని ప్రశంసిస్తూ జిల్లా కలెక్టర్‌ నుంచి ఉత్తరం వచ్చింది. 

#telugu-news #pm-modi #national-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe