భారత్‌లో దేశీయంగా అభివృద్ధి చేసిన మూడు సూపర్ కంప్యూటర్లను ప్రధాని మోదీ గురువారం ఆవిష్కరించారు. శాస్త్రీయ పరిశోధనలకై రూ.130 కోట్ల వ్యయంతో ఢిల్లీ, పూణె, కోల్‌కతాలో ఏర్పాటు చేసిన 'పరమ్ రుద్ర' సూపర్ కంప్యూటర్లను ఢిల్లీలో వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే వాతావరణ పరిశోధనల కోసం రూ.850 కోట్లతో తయారుచేసిన హై-ఫెర్ఫామెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Also read: ముడా స్కామ్ వివాదం.. సీబీఐకి షాక్ ఇచ్చిన సిద్ధరామయ్య
సాంకేతిక, కంప్యూటింగ్ సామర్థ్యంపై ఆధారపడని రంగం ఏదీ లేదని పేర్కొన్నారు. మన వాటా బిట్స్, బైట్స్‌లో కాకుండా టెరా బైట్లు, పెటా బెట్లలో ఉండాలన్నారు. భారత్‌లో సైన్స్, టెక్నాలజీ, పరిశోధనలకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. సొంతంగా సెమీకండక్టర్ ఎకో సిస్టమ్‌తో నిర్మించడంతో పాటు అంతర్జాతీయంగా సరఫరా గోలుసులో కీలకంగా ఉందని వెల్లడించారు. సైన్స్ ప్రాముఖ్యత కేవలం ఆవిష్కరణలు,అభివృద్ధికే పరిమితం కాకూదని.. దేశంలో ఉన్న ఆఖరి పౌరుడి ఆకాంక్షలను సైతం నెరవేర్చాలని పేర్కొన్నారు.
Also Read: 21 మంది విద్యార్థులపై అఘాయిత్యం.. హాస్టల్ వార్డెన్‌కు మరణ శిక్ష