రతన్ టాటా మృతి పై మోదీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు సంతాపం

ప్రముఖ వాణిజ్య దిగ్గజం రతన్ టాటా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా సంతాపం తెలిపారు. రతన్ టాటా వాణిజ్య రంగంలో ఎన్నో విలువలు పాటిస్తూ తన దైన శైలిలో దూసుకుపోయిన గొప్ప వాణిజ్యవేత్త అన్నారు.

ratan tata death
New Update

Ratan Tata: ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా బుధవారం ముంబైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో యావత్ దేశ ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు. వాణిజ్య రంగంలో ఎన్నో విలువలు పాటిస్తూ తన దైన శైలిలో దూసుకుపోయిన గొప్ప వాణిజ్యవేత్త రతన్ టాటా. ఆయన మరణంపై దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంతాపం తెలియజేస్తూ.. ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు.

ఇది కూడా చదవండిః విజన్, దాతృత్వానికి పెట్టింది పేరు–రతన్ టాటా

మోదీ సంతాపం 

''రతన్ టాటా దూరదృష్టి గల గొప్ప వ్యాపార నాయకుడు, దయగల మనస్సు కలవారు, అసాధారణమైన వ్యక్తి. అతను భారతదేశంలోని పురాతన, అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. అదే సమయంలో, మన సమాజాన్ని మెరుగుపరచాలనే నిబద్ధతతో పనిచేయడం వల్ల ఆయన్ని ఎంతో మంది ఆరాధిస్తున్నారు'' అని అన్నారు.

మరో ట్వీట్ చేస్తూ.. ''రతన్ టాటాలోని ప్రత్యేక అంశాలు ఏవైనా ఉన్నాయి అంటే అది పెద్ద కలలు కనడం. తాను సంపాదించింది సమాజానికి తిరిగి ఇవ్వడం. అది ఆయన అభిరుచి కూడా. విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం, జంతు సంరక్షణ వంటి కొన్ని కారణాలలో అతను ముందు వరుసలో ఉన్నారు'' అన్నారు.

ఇది కూడా చదవండిః పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఇక లేరు

 అలాగే మరో ట్వీట్ కూడా చేశారు. ''రతన్ టాటాతో జరిపిన ఎన్నో చర్చలు నా మనస్సులో నిండిపోయాయి. నేను సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ లో ఆయనను ఎప్పటికప్పుడు కలుస్తూ ఉండేవాడిని. మేము విభిన్న సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నాము. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా చర్చలు నడిచాయి. ఆయన మరణించడం చాలా బాధ కలిగించింది. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు అతని కుటుంబం, స్నేహితులు, అభిమానులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి" అని రాసుకొచ్చారు. 

రాహుల్ గాంధీ సంతాపం

రతన్ మరణం పట్ల రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. ''రతన్ టాటా విజన్ ఉన్న వ్యక్తి. అతను వ్యాపారం, దాతృత్వం రెండింటిలోనూ శాశ్వతమైన ముద్ర వేశారు. ఆయన కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి నా ప్రగాఢ సానుభూతి" అంటూ రాసుకొచ్చారు. 

సీఎం చంద్రబాబు సంతాపం

''రతన్ టాటా వంటి వారి దార్శనికత, చిత్తశుద్ధితో ఈ ప్రపంచంపై చిరస్థాయిగా ముద్ర వేసిన మగవాళ్ళే తక్కువ. ఈ రోజు మనం కేవలం ఒక వ్యాపార టైటాన్‌నే కాదు, నిజమైన మానవతావాదిని కోల్పోయాము. అతని వారసత్వం అతను తాకిన ప్రతి హృదయంలో నివసించడానికి పారిశ్రామిక ప్రకృతి దృశ్యాన్ని మించిపోయింది. ఈరోజు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ, పరిశ్రమ, దాతృత్వం, తరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిచ్చే దేశ నిర్మాణానికి ఆయన చేసిన విశేషమైన సహకారాన్ని కూడా నేను ప్రతిబింబిస్తున్నాను. చక్కగా జీవించే జీవితం. ఆదరించడానికి ఒక ఐకానిక్ లెగసీ. శాంతితో విశ్రాంతి తీసుకోండి. అతని ప్రియమైన వారికి, టాటా గ్రూప్‌కు ప్రగాఢ సానుభూతి'' అంటూ రాసుకొచ్చారు. 

జగన్ సంతాపం

''రతన్ టాటాను కోల్పోయినందుకు చాలా బాధపడ్డాను. నిజమైన దార్శనికుడు. అతని దయ, చిత్తశుద్ధి, నాయకత్వం మనకు, రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. టాటా కుటుంబానికి నా సానుభూతి" అంటూ రాసుకొచ్చారు. 

రేవంత్ రెడ్డి సంతాపం

''రతన్ టాటా భారతదేశపు గొప్ప పారిశ్రామికవేత్తలలో ఒకరు. భారతదేశ కార్పొరేట్ ప్రపంచంలో దూరదృష్టి గల, మానవతావాద, పురాణ వ్యక్తి. టాటా జీవితం వినయం & విజయంతో కూడిన అసాధారణ ప్రయాణం. టాటా కుటుంబానికి & ఈ అపారమైన నష్టానికి సంతాపం వ్యక్తం చేస్తున్న అసంఖ్యాక భారతీయులకు నా హృదయపూర్వక సానుభూతి. రతన్ టాటా అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి''.

#pm-modi #rahul-gandhi #ratan-tata
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe