PM Kisan : రైతులకు శుభవార్త: మరి కొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు!

రైతులకు శుభవార్త..  ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) కింద రైతులకు అందే 21వ విడత నిధులు నేడు (నవంబర్ 19, బుధవారం) విడుదల కానున్నాయి.

New Update
pm kisan

రైతులకు శుభవార్త..  ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) కింద రైతులకు అందే 21వ విడత నిధులు నేడు (నవంబర్ 19, బుధవారం) విడుదల కానున్నాయి. మరికొన్ని  గంటల్లో రైతుల ఖాతాల్లో నేరుగా రూ. 2,000 చొప్పున జమకానున్నాయి.తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నిధులను జమ చేయనున్నారు.

మోడీ ముందుగా ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంటారు.  అక్కడ పుట్టపర్తిలోని ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మందిరాన్ని సందర్శించి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం కోయంబత్తూరుకు వెళ్తారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్లకు పైగా అర్హులైన రైతులున్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి  దాదాపుగా రూ. 18,000 కోట్లు జమ అవుతాయి. కాగా పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు పొందాలంటే, లబ్ధిదారులందరూ ఈ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. అలాగే, మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి.

సన్నకారు రైతు కుటుంబాలకు

దేశంలోని చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకమే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన.  రైతుల పెట్టుబడి అవసరాలను తీర్చడానికి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతోంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ. 6,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ రూ. 6,000 మొత్తాన్ని రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో (ప్రతి 4 నెలలకు ఒకసారి) రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24, 2019న ప్రారంభించింది (డిసెంబర్ 1, 2018 నుండి అమలులోకి వచ్చింది).

Advertisment
తాజా కథనాలు