/rtv/media/media_files/2025/04/15/s4YqV2xmPDNnCtLejusK.jpg)
Jee Main Exam
జేఈఈ మెయన్ సెషన్ 2 పరీక్షలో గందరగోళం ఏర్పడింది. దీని కీ విడుదలైన తర్వాత విద్యార్థులు, వారి తల్లింద్రులు, కోచింగ్ సెంటర్లు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థులు రాసిన క్వశ్చన్ పేపర్‌కి.. జేఈఈ మెయిన్ రెస్పాన్స్ షీట్‌కి సంబంధమే లేదని చెబుతున్నారు. ఇవి రెండు వేరువేరుగా ఉన్నాయని అంటున్నారు. ఈ మేరకు ఎక్స్‌లో దీనిపై పోస్టులు పెడుతున్నారు. జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 2,3,4,7,9 తేదీల్లో జరిగిన సంగతి తెలిసిందే.
Also Read: అయ్యప్ప భక్తులకు అదిరిపోయే శుభవార్త.. ఆన్‌లైన్‌లో బంగారు నాణేలు.. ఇలా బుక్ చేసుకోండి!
మరోవైపు విద్యార్థులు చేస్తున్న ఆరోపణలపై ఈ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇంతవరకు స్పందించలేదు. ఎన్‌టీఏ విడుదల చేసిన రెస్పాన్స్ షీట్.. తాము అటెంప్ట్ చేసిన ప్రశ్నల సంఖ్యకు సరిపోవడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. అలాగే చాలావరకు తప్పుడు సమాధానాలు చూపిస్తోందని అంటున్నారు. దీంతో ఎన్‌టీఏపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
Tragedy of errors - JEE Main response sheet is different from what students actually filled in many cases + lot of answers wrongly given by @NTA_Exams @dpradhanbjp @manashTOI
— Purnima Kaul (@purnima_lodha) April 13, 2025
విద్యార్థుల భవిష్యత్తుతో ఎన్‌టీఏ ఆడుకుంటుందని వారి తల్లిందడ్రులు విమర్శిస్తున్నారు. రెస్పాన్స్ షీట్‌కు, విద్యార్థులు రాసిన క్వశ్చన్ పేపర్‌కు తేడాలున్నాయని చెబుతున్నారు. ఓ యూజర్ స్పందిస్తూ.. '' నా కూతురు 71 ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. సబ్‌మిట్ చేసే సమయంలో 71 ప్రశ్నలు అటెంప్ట్ చేసినట్లు చూపించింది. కానీ ఇప్పుడు రెస్పాన్స్ షీట్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని చూయిస్తోంది. ఎన్‌టీఏ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోంది. ఈమెయిల్‌లో మెసేజ్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మరో యూజర్ స్పందిస్తూ.. '' నా కూతురు 50 ప్రశ్నలను అటెంప్ట్ చేసింది. కానీ రెస్పాన్స్ షీట్‌లో 48 అటెంప్ట్ చేసినట్లు చూపిస్తోందని'' చెప్పారు. ఎన్‌టీఏ దీనిపై స్పందించాలని.. తమకు అన్యాయం జరగకుండా చూడాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Tragedy of errors - JEE Main response sheet is different from what students actually filled in many cases + lot of answers wrongly given by @NTA_Exams @dpradhanbjp @manashTOI
— Purnima Kaul (@purnima_lodha) April 13, 2025
Tragedy of errors - JEE Main response sheet is different from what students actually filled in many cases + lot of answers wrongly given by @NTA_Exams @dpradhanbjp @manashTOI
— Purnima Kaul (@purnima_lodha) April 13, 2025
telugu-news | rtv-news | jee-mains