/rtv/media/media_files/2025/04/24/u5eGqm6ZqTyrPsAf5YZ2.jpg)
పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ ఆర్మీ హస్తం ఉందని భారత్ ఆరోపిస్తోంది. 26 మంది పర్యటకులను పొట్టనబెట్టుకున్నందుకు ప్రతిచర్యగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీంతో భారత్ వై వ్యతిరేకిస్తూ పాకిస్థాన్ ప్రతీకార చర్యలకు దిగింది. దీనిపై పాకిస్థాన్ సర్కారు స్పందించింది. పహల్గామ్ దాడిలో తమ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు చూపాలని పాకిస్థాన్ కోరింది. ప్రపంచ దేశాలకు ఆ ఆధారాలను చూపించాలని పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఇతరులతో కలిసి మాట్లాడారు.
#Breaking #Pakistan #India #Pahalgam #pahalgamattack
— Ihsan Ulhaq (@Ihsan0622) April 24, 2025
🚨Pakistan Claims India Is Harbouring Foreign Combatants In Srinagar Pakistan's Deputy Prime Minister, Ishaq Dar, has claimed that Indian authorities are sheltering foreign combatants in the disputed territory of Srinagar.… pic.twitter.com/oA4eNS7ybo
శ్రీనగర్‌లోకి కొందరు విదేశీయులు ఆయుధాలతో ప్రవేశించారని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని డిప్యూటీ ప్రధాని దార్ తెలిపారు. భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆ వ్యక్తులను శ్రీనగర్‌లో దాచినట్లు పాక్ డిప్యూటీ పీఎం ఆరోపించారు. భారతీయ నిఘా సంస్థలు విదేశీయులకు సపోర్టు ఇస్తున్నాయని, ఆ విదేశీయులు భారత్‌కు ఐఈడీలు సరఫరా చేస్తున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి పేర్కొన్నారు. ఒకవేళ భారత్ తమపై ఎలాంటి చర్యలకు దిగినా, దాన్ని ఎదుర్కొనేందుకు పాక్ సైనిక దళాలు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.
( bla attack on pak army | PAK Army | india war news | pok | pak-pm-shehbaz-sharif | Pakistan Deputy PM)