/rtv/media/media_files/2025/04/24/BVJW3H29riKQalTGBCFe.jpg)
seema haider-pak
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది పర్యాటకులను బలిగొన్న ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జాతీయురాలు సీమా హైదర్ కూడా భారత్ నుంచి విడిచి వెళ్లాల్సి వస్తుందా అనే అనుమానాలు ఇప్పుడు అందరిలో నెలకొన్నాయి. సీమా హైదర్ అనే పాకిస్తానీ మహిళ రెండేళ్ల క్రితం తన నలుగురు పిల్లలతో కలిసి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించింది.
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని జాకోబాబాద్‌కు చెందిన 32 ఏళ్ల ఆమె తన పిల్లలను తీసుకొని 2023 మేలో కరాచీలోని తన ఇంటి నుండి నేపాల్ మీదుగా భారత్ కు బయలుదేరింది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల సచిన్ మీనాతో ప్రేమలో పడిన ఆమె ఇప్పుడు అతన్ని పెళ్లి చేసుకుని అతనితోనే నివసిస్తుంది. 2019లో ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్నప్పుడు ఈ జంట పరిచయం ఏర్పడగా అది ప్రేమకు దారి తీసింది. అనంతరం ఇద్దరు పెళ్లి చేసుకోగా ఈ జంటకు ఓ సంతానం కూడా కలిగారు.
సీమా హైదర్ పరిస్థితి ఏంటీ?
మీనాను వివాహం చేసుకున్న తర్వాత హైదర్ హిందూ మతాన్ని స్వీకరించింది. అయితే తాజాగా దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాకిస్తాన్ పౌరులందరూ భారత్ నుండి 48 గంటల్లో వెళ్లిపోవాలి.. మరి సీమా హైదర్ పరిస్థితి ఏంటీ అన్నది హాట్ టాపిక్ గా మారింది. అక్రమంగా ఇండియాలోకి వచ్చిందన్న కేసు నడుస్తుండటంతో ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది.
సీమా హైదర్ ఒక భారతీయుడిని వివాహం చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చింది కాబట్టి ఆమెపై ఏదైనా చర్యలు తీసుకోవాలంటే అది రాష్ట్ర అధికారుల నుండి వచ్చే నివేదికపై ఆధారపడి ఉంటుంది. ఇక సీమా హైదర్ భారత్ లోకి ప్రవేశించిన విధానం ఆమె పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తుంది. చెల్లుబాటు అయ్యే వీసాలపై దేశంలోకి ప్రవేశించిన ఇతర పాకిస్తానీ జాతీయుల మాదిరిగా కాకుండా, ఆమె నేపాల్ ద్వారా ఇండియాకు చేరుకుంది. ఇంకా, ఆమెకు ఇంకా భారత పౌరసత్వం పొందలేదు. ప్రస్తుతానికి అందరి దృష్టి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, న్యాయవ్యవస్థపైనే ఉంది. మరోవైపు ఆమె పాకిస్తానీ భర్త కూడా తన భార్య తిరిగి రావాలని న్యాయ పోరాటం చేస్తున్నాడు.