OYO: పండగ చేసుకోండి..ఓయోలో ఐదు రోజులు ఫ్రీ ఫ్రీ

ఐదు రోజులు ఫ్రీ గా ఉండండి...పండుగ చేసుకోండి అంటోంది ఓయో. రెగ్యులర్ గా వచ్చే వారికి ఈ ఐదు రోజుల్లో ఎప్పుడైనా రూమ్ ఫ్రీగా బుక్ చేసుకుని స్టే చేయొచ్చని అనౌన్స్ చేసింది.  మొత్తం వెయ్యికి పైగా ఓయో హోటల్స్ లో ఈ ఆఫర్ ను ఇస్తోంది. 

New Update
hotels

OYO Hotels Photograph: (Google)

ఈ వీకెండ్ ను పండుగ చేసుకోండి అంటున్నారు ఓయో కంపెనీ ఫౌండర్ రితేశ్ అగర్వాల్. ఇండియా చాంపియన్స్ ట్రోఫీ విక్టరీ, హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకోండంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రతీ మూమెంట్ ను ఎప్పటికీ సెలబ్రట్ చేసుకునేలా ఉందాం...దాని కోసం ఏం చేస్తే బాగుంటుందో తెలుసా..ప్రయాణం చేయడం, ఇష్టమైన వాళ్లని కలవడంతో మూమెంట్స్ ను సొంతం చేసుకోండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇండియా చాంపియన్స్ ట్రోఫీ విక్టరీ, హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకోండంటూ సూపర్ ఆఫర్ ఇచ్చారు. 

ఐదు రోజులు ఫ్రీ..

మార్చి 13 నుంచి 18 వరకు ప్రతీరోజూ ఓయో ఫ్రీగా బుక్ చేసుకుని స్టే చేయండని ఓయో ఫండర్ రితేశ్ చెబుతున్నారు.  ఛాంపియన్స్ ట్రోఫీ విక్టరీతో పాటూ హోలీ రంగులను చల్లుకుంటూ సెలబ్రేట్ చేసుకోండి అని చెబుతున్నారు. లైఫ్ అంటే జస్ట్ ఫన్, ఫ్యామిలీ, సెలబ్రేషన్ అంటూ ఆఫర్ ను ప్రకటించారు. మొత్తం 1000 హోటల్స్ లో ఈ వీకెండ్ లో ఫ్రీగా ఉంచొచ్చని చెప్పారు. ఛాంపియన్ అనే కూపన్ కోడ్ ను బుకింగ్ ఎంట్రీలో అప్లై చేస్తే రూమ్ ఫ్రీగా వస్తుందని తెలిపారు. ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్ లో CHAMPION అని రాయాలని సూచించారు. ఓయో వెబ్ పైట్ లో మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపారు. డెయిలీ 2 వేల ఫ్రీ స్టే ఆఫర్ ఇస్తోంది కంపెనీ. అంటే ఫస్ట్ బుక్ చేసుకున్న 2000 మందికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. 

 

Also Read: TS: భద్రాచాలంలో ఘోర అపరాధం..ఆలస్యమైన అంకురార్పణ పూజ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు