Operation Mahadev: పాక్ పోషిత ఉగ్రవాదంపై మోదీ సర్కార్ మరో బాంబ్..

ఆపరేషన్ మహాదేవ్‌లో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. మోదీ ప్రభుత్వం పాక్ ఉగ్ర ముఠాలపై వ్యూహాత్మక పోరాటం సాగిస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తారుణ్ చుగ్ కాంగ్రెస్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ, సైన్యం వీరోచితంగా ముందుకు సాగుతోందన్నారు.

New Update
Operation Mahadev

Operation Mahadev

Operation Mahadev:

భారత ప్రభుత్వం పాక్ ఉగ్రవాద ముఠాలపై దాడులను మరింత కఠినంగా చేస్తున్నట్టు తాజా ఆపరేషన్ 'మహాదేవ్'(Operation Mahadev) ద్వారా స్పష్టమవుతోంది. శ్రీనగర్‌లోని మహాదేవ్ పీక్ సమీపంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన మాస్టర్‌మైండ్(Pahalgam Terrorist Killed) ఉన్నట్లు సమాచారం. కాగా భారత భద్రతా దళాల సాహసానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Also Raed: ‘ఆపరేషన్ మహదేవ్‌’.. పహల్గాం ఉగ్రవాదులను ఎలా లేపేసారో తెలుసా ?

ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తారుణ్ చుగ్(BJP Tarun Chugh) స్పందిస్తూ, మోదీ(PM Modi) ప్రభుత్వం ఉగ్రవాద నిర్మూలనలో చూపుతున్న వీరోచిత పోరాటాన్ని పొగిడారు. ఇది ఒక్కసారిగా జరిగిన చర్య కాదు, ఇది పూర్తిగా ఒక వ్యూహాత్మక యుద్ధ సిద్ధాంతం అని ఆయన స్పష్టం చేశారు. ఈ యుద్ధ స్ట్రాటజీ లో పాకిస్తాన్ ISI పాత్ర కూడా ముఖ్యమని పేర్కొన్నారు.

ఇంతకుముందు ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని లష్కరే తోయ్బా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద శిబిరాలపై టార్గెట్ చేసిన దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. 

Also Read: చచ్చారు కొడుకులు.. పహల్గామ్ ఉగ్రదాడి టెర్రరిస్టులు ఎన్‌కౌంటర్‌

అలాగే పార్లమెంట్‌లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరుగుతుండగా, కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై చుగ్ తీవ్రంగా మండిపడ్డారు. పహల్గాం దాడి వెనుక పాకిస్తాన్ ఉందా? ఉగ్రవాదులు దేశీయవాళ్లేనా? అనే శైలిలో కాంగ్రెస్ నాయకులు పి.చిదంబరం, గౌరవ్ గోగోయ్ మాట్లాడటం బాధాకరమని తెలిపారు. “సైన్యం, ఇంటలిజెన్స్ ఏజెన్సీలు, బాధిత కుటుంబాలు మీ ధ్రువీకరణ పత్రం కోసం ఎదురుచూస్తాయా?” అంటూ ఆయన వ్యంగ్యంగా విమర్శించారు.

చుగ్ అన్నట్టుగానే మోదీ ప్రభుత్వం శక్తివంతంగా పని చేస్తూ, ఉగ్ర ముఠాలను నాశనం చేయడంలో ముందంజలో ఉంది. దేశపు పవిత్ర ప్రదేశాలైన శ్రీ హర్మందిర్ సాహిబ్, వైష్ణోదేవి, అమర్నాథ్ యాత్ర  రక్షించటం మోదీ ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా కొనసాగుతుందని ఆయన చెప్పారు.

Advertisment
తాజా కథనాలు