Air India Flight Crash: మరుపురాని బాధ..ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి నెల..

అహ్మదాబాద్ ఎయిర్ ఇండయా విమాన ప్రమాదం జరిగిన సరిగ్గా ఇవాల్టికి నెల రోజులు అయింది. అయినా ఇంకా ఆ గాయాలు వీడలేదు. ఫ్లైట్ ప్రయాణాల మీద భయం పోలేదు. ఈరోజుకు జనాలు విమానం ఎక్కాలంటే భయపడుతున్నారు.

New Update
Air India Flight Crash

అదొక పీడకల. భారతదేశ చరిత్రలో ఆ రోజును ఎప్పటకీ మరిచిపోలేరు. 269 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఆ రోజు ఇంకా వెంటాడుతూనే ఉంది. సరిగ్గా నెల రోజుల క్రితం ఇదే రోజున అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఏఐ 171 విమానం కొద్దిసేపటిలోనే కూలిపోయింది. పైలెట్లు, సిబ్బందితో సహా ప్రయాణికులు అందరూ మరణించారు. దాంతో పాటూ విమానం ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ మీద పడడంతో అక్కడి విద్యార్థులు, డాక్టర్లు కూడా చనిపోయారు. ఈ సంఘటన ఓ పెద్ద విషాదంగా మారింది. విమాన కూలిన వెంటనే పేలిపోవడంతో లోపల ఉన్నవారు అందరూ కాలిపోయారు. ఎవరు ఎవరన్నది గుర్తించడం కష్టం అయింది. డీఎన్ఏల ద్వారా మృతులను గుర్తించారు. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో కథ. నిన్న మొన్నటి వరకు అవే విషయాలు మాట్లాడుకున్నారు. 

ఈరోజే ప్రాథమిక దర్యాప్తు..

దాంతో పాటూ ఈరోజూ విమాన ప్రమాదం మీద ఏఏఐబీ ప్రాథమిక దర్యాప్తును కూడా ఇచ్చింది. ప్రమాదం తర్వాత ఫోటోలు, వీడియోలు, బ్లాక్ బాక్స్ తదితర వాటిని పరిశీలించాక దీనిపై ప్రాథమిక నివేదికను సమర్పించింది ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగెంట్‌ బ్యూరో. విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్ లు సెకన్ పాటూ ఆగిపోవడమే యాక్సిడెంట్ కు కారణమని తేల్చింది. మొత్తం 15 పేజీల నివేదికను ఏఏఐబీ సమర్పించింది. రెండు ఇంజిన్లూ ఒకేసారి ఆగిపోయాయని చెప్పింది. కాక్ పిట్ లో పైలెట్ల వాయిస్ రికార్డ్ ఆధారంగా దీన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో ఇంజిన్లను ఎందుకు ఆఫ్ చేశావని ఒక పైలెట్...రెండో పైలెట్ ను అడిగారని తెలుస్తోంది. అయితే మొదటి పైలెట్ తాను స్విఛాఫ్ చేయలేదని చెప్పారని...తర్వాత మేడే కాల్ ఇచ్చారని నివేదికలో రాశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెండు ఇంజిన్లు కటాఫ్ అయినా విమానం అవసరమైన ఎత్తుకు ఎగరగలిగింది. తర్వాత రెండు ఇంజిన్లలో ఒకటి వెంటనే ఆన్ అయినా రెండో దానిని మాత్రం స్విఛాన్ చేయలేకపోయారు. 

ఇంకా వీడని భయం..

ఇప్పుడు నెల రోజుల తర్వాత కూడా ఫ్లైట్ ఎక్కాలంటే జనాలు భయపడుతున్నారు. తమ వారిని విమానం ఎక్కించాక..బంధువులు వారు వెళ్ళే వరకు నిమిషాలు లెక్క పెడుతున్నారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళే ఫ్లైట్లు మామూలుగానే తిరుగుతున్నాయి. ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు. కానీ గుండెల్లో గుబులు మాత్రం పోవడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ఎవరిని అడిగినా ఇదే సమాధానం చెబుతున్నారు. తీరని విషాదం మిగిల్చిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మాసిపోవడానికి చాలారోజులే పడుతుందని అంటున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు