విద్యార్థులకు షాక్.. చీటింగ్ చేస్తే ఎన్నేళ్లు జైలు శిక్షంటే?

పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు చీటింగ్ చేస్తే మూడు నుంచి ఐదేళ్ల పాటు జైలు శిక్షతో పాటు రూ.10 లక్షలు జరిమానా విధిస్తూ ఒడిశా ప్రభుత్వం బిల్లును రూపొందించింది. రాబోయే శీతాకాల సమావేశంలో ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

New Update
AP Tenth Exams 2023: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్స్ పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం!

పబ్లిక్ పరీక్షల సమయంలో కొందరు విద్యార్థులు చీటింగ్ చేస్తుంటారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని ఒడిశా ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకురానుంది. పబ్లిక్ పరీక్షల్లో ఎవరైనా విద్యార్థులు చీటింగ్ చేస్తూ దొరికినట్లయితే లేదా ఏవైనా అవకతవకలకు పాల్పడినట్లయితే మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. దీంతో పాటు రూ.10 లక్ష వరకు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

ఇది కూడా చూడండి: ఉత్కంఠంగా సాగిన మూడో టీ20..భారత్ విజయం

రాబోయే శీతాకాల సమావేశాల్లో..

దీనికి సంబంధించిన బిల్లుకి ఒడిశా ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. రాబోయే శీతాకాల సమావేశాల్లో దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఎవరైనా పరీక్షల పేరుతో మోసం చేస్తే ఐపీసీ కింద ఏడేళ్ల వరకు, బీఎన్‌ఎస్ కింద మూడేళ్ల వరకు వారికి శిక్ష పడుతుంది. అయితే ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: ఈరోజే మనకు బాలల దినోత్సవం..ఏఏ దేశాల్లో ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?

కేవలం పబ్లిక్ పరీక్షలు అనే కాకుండా వివిధ పరీక్షల కోసం కొందరు మధ్య వర్తిలతో డీల్ కుదుర్చుకుంటారు. ఇలాంటి వారికి దాదాపుగా రూ. కోటి వరకు జరిమానా విధిస్తారు. అలాగే పరీక్ష ఖర్చు వంటివి కూడా వారి నుంచే వసూలు చేస్తారు. ఒకవేళ ఎవరైనా ఇంత జరిమానా చెల్లించకలేకపోతే వారికి భారతీయ న్యాయ సంహిత, 2023లోని నిబంధనల ప్రకారం అదనంగా జైలు శిక్ష విధిస్తారు. 

ఇది కూడా చూడండి: Booker Prize: బుకర్‌ప్రైజ్ విజేతగా మొదటిసారి ఓ మహిళ

గతంలో ఒడిశాలో ఓ చట్టం అమలులో ఉండేది. 1988 సమయంలో ఒరిస్సా కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనే చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఈ చట్టం కింద ఎవరైనా పరీక్షల్లో చీటింగ్ చేస్తే మూడు నెలల శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించేవారు. 

ఇది కూడా చూడండి: కంగువ ట్విట్టర్ రివ్యూ.. సూర్య బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టినట్లేనా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు